చైనా ని ఎదురుకోవడానికి భారత్ కి మద్దతుగా అమెరికా బలగాలు దేశానికి వచ్చాయని చెప్తూ రెండు ఫోటోలను ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఫోటోలు చైనా ని ఎదురుకోవడానికి భారత్ కి మద్దతుగా వచ్చిన అమెరికా బలగాలకి సంబంధించినవి.
ఫాక్ట్ (నిజం): అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపీయో భారతదేశం, ఆగ్నేయాసియా దేశాలకు ఉన్న చైనా ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యాన్ని మోహరిస్తునట్టు చెప్పారు. అయితే, భారత్ కి అమెరికా బలగాలు వచ్చినట్లుగా ఎటువంటి సమాచారం లేదు. అంతేకాదు, పోస్టులో ఫోటో పాతవి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
భారత్ మరియు చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపీయో భారతదేశం, ఆగ్నేయాసియా దేశాలు చైనా ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యాన్ని మోహరిస్తునట్టు చెప్పారు. అయితే, భారత్ కి అమెరికా బలగాలు వచ్చినట్లుగా ఎటువంటి సమాచారం లేదు. ఇక పోస్టులో పెట్టిన ఫోటోలు ఎప్పటివో చూద్దాం.
ఫోటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికినప్పుడు, అది ‘Alamy’ స్టాక్ ఫొటోస్ లో లభించింది. ఆ వెబ్సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం, ఫోటో 2013 లో ఇండియన్ ఆర్మీ మేజర్ ప్రశాంత్ మిశ్రాని అమెరికా సైన్యానికి చెందిన కెప్టెన్ కల్లెన్ లిండ్ తమ ఆయుధ శ్రేణిని పరిచయం చేసే ట్రైనింగ్ ప్రోగ్రాంకి స్వాగతం తెలిపినప్పుడు తీసింది.
ఫోటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికినప్పుడు, అది ‘Reddit’ లోని ఒక కథనం లో లభించింది. 2016 లో భారత సైన్యం మరియు యుఎస్ ఆర్మీ పసిఫిక్ మధ్య వార్షిక ద్వైపాక్షిక ఎక్సర్సైజ్ ‘యుధ్ అభ్యాస్’ 12వ ఎడిషన్ సందర్భంలో ఆ ఫోటోని తీశారు. ఆ ఫోటో క్రింద ‘ఫీల్డ్ ట్రామా మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ సమయంలో ఒక భారతీయ సైనికుడు యుఎస్ సైనికుడిని మోసుకెళ్తున్నాడు’ అనే వివరణ ఉంది.
చివరగా, పాత ఫోటోలు పెట్టి ‘భారత్ చేరిన అమెరికా బలగాలు’ అనే తప్పుడు సమాచారం షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?