Fake News, Telugu
 

ఈ వీడియోలో మహిళను చెట్టుకి వేలాడదీసి కొట్టిన వ్యక్తులకు RSSతో సంబంధాలు ఉన్నట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు

0

RSS వ్యక్తులు ఒక మహిళను చెట్టుకు వేలాడదీసి కొడుతున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. బీజేపీ అధికారం చూసుకొని ఇలా చేస్తున్నారంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: RSS వ్యక్తులు ఒక మహిళను చెట్టుకు వేలాడదీసి కొడుతున్న వీడియో.

ఫాక్ట్(నిజం):  ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్‌పూర్ జిల్లాలో జులై 2021లో  జరిగింది. 19 ఏళ్ళ ఒక గిరిజన మహిళ పెళ్ళైన మూడు రోజులకే భర్త ఇంటిని విడిచి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవడంతో ఆగ్రహించిన ఆ మహిళ తండ్రి మరియు కజిన్స్ ఆమెను ఇలా చేటుకు వేలాడదీసి కొట్టారు. ఐతే ఈ ఘటనకు RSSతో గాని మరేతర రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియోలోని ఘటన బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగినప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన నిందితులు RSSకు చెందిన వారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పైగా ఇది ఒక పాత ఘటన, జులై 2021లో జరిగింది.

ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం జులై 2021లో అలీరాజ్‌పూర్ జిల్లాలోని బడి ఫూల్ తలాబ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ళ ఒక గిరిజన మహిళ పెళ్ళైన మూడు రోజులకే భర్త ఇంటిని విడిచి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవడంతో ఆగ్రహించిన ఆ మహిళ తండ్రి మరియు కజిన్స్ ఆమెను ఇలా చేటుకు వేలాడదీసి కొట్టారు.

అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు అమ్మయి కజిన్స్ మరియు తండ్రిపై కేసు ఫైల్ చేసారు, ఇదే విషయాన్ని అలీరాజ్‌పూర్ ఎస్పీ మీడియాకు తెలిపారు. ఆ అమ్మాయికి గాయాలు కావడంతో ఆమెను హాస్పిటల్‌లో చికిత్స అందించారు.

ఈ ఘటనను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే పోస్టులో ఆరోపిస్తున్నట్టు నిందితులు RSS కార్యకర్తలని గానీ, లేక వారికి RSSతో సంబంధాలు ఉన్నట్టు గానీ ఎటుంటి రిపోర్ట్స్ లేవు. పైగా ఈ ఘటనకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నట్టు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు.

చివరగా, మహిళను చెట్టుకి వేలాడదీసి కొట్టిన వ్యక్తులకు RSSతో సంబంధాలు ఉన్నట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు.

Share.

About Author

Comments are closed.

scroll