Fake News, Telugu
 

ప్రపంచంలోని ఐకానిక్ భవనాలపై భారతీయ త్రివర్ణ రంగులతో ఉన్న ఈ ఫోటోలు ఎడిట్ చేయబడినవి

0

ప్రపంచంలోని కొన్ని ఐకానిక్ భవనాలపై భారతీయ త్రివర్ణ రంగులతో ఉన్న ఇమేజీలను ఫోటో కొలాజ్ చేసి ఒక పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటో కొలాజ్‌లో పెట్రోనాస్ ట్విన్ టవర్స్, లీనింగ్ టవర్ ఆఫ్ పిసా, బుర్జ్ అల్ అరబ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, 30 సెయింట్ మేరీ యాక్స్, బిగ్ బెన్, ఈఫిల్ టవర్, క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం ఉన్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రపంచంలోని ఐకానిక్ భవనాలపై భారతీయ త్రివర్ణ రంగులతో ఉన్న ఫోటోల కొలాజ్.

ఫాక్ట్: ప్రపంచంలోని ఐకానిక్ భవనాలపై భారతీయ త్రివర్ణ రంగులతో ఉన్న ఈ ఫోటో కొలాజ్‌ను ఫిల్టర్‌కాపీ ఫేస్బుక్ అకౌంట్ వారు ఎడిట్ చేసారు. ఇవి నిజంగా జరిగిన సంఘటనలకి సంబంధించినవి కాదు. ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై భారతీయ త్రివర్ణ పతాకం ప్రొజెక్ట్ చేయబడింది. పెట్రోనాస్ ట్విన్ టవర్స్, లీనింగ్ టవర్ ఆఫ్ పిసా, బుర్జ్ అల్ అరబ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, 30 సెయింట్ మేరీ యాక్స్, బిగ్ బెన్, ఈఫిల్ టవర్, క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహంపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయ త్రివర్ణ రంగులు ఇటీవల ప్రాజెక్ట్ అయినట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులోని ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఇమేజీలతో ఉన్న ఒక ఫేస్బుక్ పోస్ట్ లభించింది. “ప్రసిద్ధ స్మారక చిహ్నాలు మరియు భవనాలు భారతీయ త్రివర్ణ రంగులలో వెలిగితే, అవి ఎలా ఉంటాయో ఇక్కడ ఉంది!” అని వారు 26 జనవరి 2017లో పెట్టిన ఫేస్బుక్ పోస్టులో ఇవే ఇమేజీలు చూడొచ్చు. అలా భారతీయ త్రివర్ణ రంగులతో వెలిగుంటే, ఇలా ఉండేదని వారు ఫేస్బుక్ ద్వారా చెప్పారు, కానీ, నిజంగా అలా జరిగిందని వారు అనలేదు.

ఫిల్టర్‌కాపీ వారు పోస్ట్ చేసిన ఇమేజీలలోనే ఒక్కో ఇమేజ్ కింద ఇది ఎడిట్ చేయబడిన ఫోటో అని చిన్న అక్షరాలతో రాసారు. అందుకే భారతీయ త్రివర్ణ రంగులతో ఉన్న ఈ  ఇమేజీలు ఎడిట్ చేయబడినవి, నిజంగా జరిగిన సంఘటనలు కాదు.

2017లో కూడా పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఇదే ఫోటో కొలాజ్‌ను పోస్ట్ చేసినప్పుడు ఇది ఒక ఫేక్ ఫోటో అని ట్రోల్ చేసారు. ఫోటో నిజమైనదని తాను నమ్మిందా, ఫోటో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశాల గురించి మాకు ఖచ్చితంగా తెలియదు అని ఆర్టికల్ ద్వారా చూడొచ్చు.

ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై భారతీయ త్రివర్ణ పతాకం, స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ప్రొజెక్ట్ చేయబడింది. అలాగే న్యూ యార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, యుకేలోని ఐకానిక్ లైబ్రరీ ఆఫ్ బర్మింగ్ హామ్లో, కెనడాలోని నయాగరా ఫాల్స్ పై , స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయ త్రివర్ణ రంగులు ప్రాజెక్ట్ చేయబడ్డాయి.

పెట్రోనాస్ ట్విన్ టవర్స్, లీనింగ్ టవర్ ఆఫ్ పిసా, బుర్జ్ అల్ అరబ్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, 30 సెయింట్ మేరీ యాక్స్, బిగ్ బెన్, ఈఫిల్ టవర్, క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహంపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయ త్రివర్ణ రంగులు ఇటీవల ప్రాజెక్ట్ అయినట్టు న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు.

చివరగా, ప్రపంచంలోని ఐకానిక్ భవనాలపై భారతీయ త్రివర్ణ రంగులతో ఉన్న ఈ ఇమేజీలు ఎడిట్ చేయబడినవి.

Share.

About Author

Comments are closed.

scroll