Fake News, Telugu
 

శివాజీ చంద్రబాబుని ప్రశ్నించడం నిజమే, కానీ ఎన్నికలకి రెండు రోజుల ముందు కాదు. అది రెండేళ్ళ క్రితం వీడియో.

0

ఎన్నికలకు రెండు రోజుల ముందు నటుడు శివాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తూ ఒక వీడియో పెట్టాడని ఫేస్బుక్ లో చాలా మంది ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): రెండ్రోజుల్లో ఎన్నికలుండగా చంద్రబాబుపై సంచలన వాఖ్యాలు చేసిన శివాజీ.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియో నిజంగానే శివాజీ  పెట్టారు. కానీ అది రెండేళ్ళ క్రితం వీడియో. ఎన్నికల ముందు మళ్ళీ ఆ వీడియో ని పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని వీడియో చూస్తే శివాజీ చంద్రబాబుని ప్రశ్నిస్తున్నట్టుగా చూడవచ్చు. కాబట్టి య్యూట్యూబ్ లో ‘Sivaji questions Chandrababu’ అని వెతికితే సెర్చ్ రిజల్ట్స్ లో ఫేస్బుక్ లో షేర్ అవుతున్నలాంటి వీడియోలు వస్తాయి. దాంట్లో ఒక వీడియో టైం స్టాంప్ చూస్తే రెండేళ్ళ క్రితం పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కావున, పాత వీడియో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, శివాజీ చంద్రబాబుని ప్రశ్నించడం నిజమే, కానీ ఎన్నికలకి రెండు రోజుల ముందు కాదు. అది రెండేళ్ళ క్రితం వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll