Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఉస్మానియా ఆసుపత్రిలోని అనాధ శవాల పాత వీడియోని కరోనా బారిన పడి చనిపోయిన వ్యక్తుల శవాలంటూ షేర్ చేస్తున్నారు

0

కరోనా వైరస్  బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల శవాలు ఉస్మానియా ఆసుపత్రిలో గుట్టలుగా పడివున్నాయంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల శవాలకు సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ): పోస్టులో షేర్ చేసిన వీడియో కరోనా నేపథ్యంలో తీసిన వీడియో కాదు. 2013లో ఉస్మానియా ఆసుపత్రిలోని అనాధ శవాలకు సంబంధించిన వీడియో అని మా విశ్లేషణలో తెలిసింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా ఈ వీడియోని ‘IND TODAY’ యుట్యూబ్ ఛానల్లో వెతకగా, 25 డిసెంబర్ 2013 లో ఈ వీడియో పోస్ట్ చేసినట్టు గా తెలిసింది. వీడియో కింద వివరణలో, హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలోని అనాధ శవాలు పరిస్థితి ఇది అని రాసి ఉండటం మనం చూడవచ్చు.

వివరణలోని ఇచ్చిన సమాచారం ఆధారంగా మళ్ళీ యూట్యూబ్ లో వెతకగా, ఇవే దృశ్యాలు ఉన్న ఒక వీడియోలో బిజేపి నాయకుడు, అప్పటి MLA కిషన్ రెడ్డి, ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న అనాధ శవాలని ఖననం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండటం గమనించవచ్చు. ఈ వీడియో కూడా 2013 డిసెంబర్లో పోస్ట్ చేయడం జరిగింది. కావున పోస్ట్ లో షేర్ చేస్తున్న ఈ వీడియో పాతది.

చివరగా, 2013లో ఉస్మానియా ఆసుపత్రిలోని అనాధ శవాలకు సంబంధించిన వీడియోని చూపించి కరోన కారణంగా మరణించిన వ్యక్తుల శవాలంటూ షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll