Fake News, Telugu
 

భారత్ తీర్చేసింది తమ ఐక్యరాజ్యసమితి బకాయిలు, ప్రపంచ బ్యాంకు కి తాము చెల్లించాల్సిన అప్పులు కాదు

1

సయ్యద్ అక్బరుద్దీన్ (India’s Ambassador & Permanent Representative to the United Nations) చేసిన ట్వీట్ ఫోటో పెట్టి ప్రపంచ బ్యాంకు అప్పును పూర్తిగా తీర్చేసిన ప్రధాని మోడీ అంటూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రపంచ బ్యాంకు భారత్ కి ఇచ్చిన అప్పులను తీర్చేసిన ప్రధాని మోడీ.

ఫాక్ట్ (నిజం): సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేసింది ఐక్యరాజ్యసమితికి భారత్ చెల్లించిన బకాయిల గురించి, ప్రపంచ బ్యాంకు కి భారత్ కట్టాల్సిన అప్పుల గురించి కాదు. ప్రపంచ బ్యాంకు కి భారత్ కొన్ని బిలియన్ల డాలర్లు కట్టాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు వెబ్ సైట్ లో చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ట్వీట్ ని సరిగ్గా గమనిస్తే, సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేసింది ఐక్యరాజ్యసమితికి భారత్ చెల్లించిన బకాయిల గురించి అని తెలుస్తుంది. ఐక్యరాజ్యసమితి బడ్జెట్ కి ప్రతి దేశం కొంత డబ్బును చెల్లిస్తుంది, భారత్ చెల్లించాల్సిన డబ్బును భారత్ చెల్లించిందని సయీద్ ట్వీట్ చేసాడు. ఐక్యరాజ్యసమితికి భారత్ చెల్లించిన బకాయిలకు, ప్రపంచ బ్యాంకు నుండి భారత్ తీసుకున్న అప్పులకు సంబంధం లేదు. ప్రపంచ బ్యాంకు కి భారత్ చెల్లించాల్సిన అప్పుల గురించి ప్రపంచ బ్యాంకు వెబ్ సైట్ లో చూడవొచ్చు. వివిధ ప్రాజెక్టుల కొరకు ప్రపంచ బ్యాంకు గ్రూప్ లోని IBRD, IDA (International Bank for Reconstruction and Development), IDA (International Development Association) మరియు IFC (International Finance Corporation) దగ్గర నుండి కొన్ని బిలియన్ల డాలర్లను తీసుకున్నట్టుగా ప్రపంచ బ్యాంకు వెబ్ సైట్ లో చూడవొచ్చు. ఈ రుణాలను మొత్తం మోడీ తీర్చేసినట్టు చెప్పడం తప్పు.

చివరగా, భారత్ చెల్లించింది తమ ఐక్యరాజ్యసమితి బకాయిలు, ప్రపంచ బ్యాంకు కి చెల్లించాల్సిన తమ అప్పులు కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll