‘దసరా సెలవులను దీపావళి వరకు పొడిగించిన కేసీఆర్ ‘ అంటూ టీవీ9 వార్తా ప్రసారం యొక్క ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. దాంట్లో ఎంత వాస్తవం ఉందో కనుక్కుందాం.
క్లెయిమ్: తెలంగాణా ప్రభుత్వం దసరా సెలవులను ఈ నెల 31 వరకు పెంచింది.
ఫాక్ట్ (నిజం): తెలంగాణా ప్రభుత్వం దసరా సెలవులను అక్టోబర్ 19 వరకు పెంచింది. ప్రభుత్వం సెలవులను ఈ నెల 31 వరకు పెంచినట్లుగా ఉన్న టీవీ9 వారి బ్రేకింగ్ న్యూస్ ప్లేట్ మార్ఫింగ్ చేసినది. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.
తెలంగాణా ప్రభుత్వం దసరా సెలవులను అక్టోబర్ 19 వరకు పెంచుతున్నట్లుగా ఈ నెల 12న ప్రకటించింది. ప్రభుత్వం దసరా సెలవులను అక్టోబర్ 31 వరకు పెంచినట్లుగా సమాచారమేమీ లభించలేదు. పోస్టులో పెట్టిన టీవీ9 బ్రేకింగ్ న్యూస్ ప్లేట్ ని చూసినప్పుడు, అందులో ‘ఫాంట్’ తేడాలు కనిపిస్తున్నాయి. దాంతో, ప్రభుత్వం దసరా సెలవులను అక్టోబర్ 19 వరకు పెంచినప్పుడు, టీవీ9 వారు ప్రసారం చేసిన కథనం కోసం యూట్యూబ్ లో వెతికినప్పుడు ఆ న్యూస్ వీడియో లభించింది. దానిని చూసినప్పుడు, ఆ సందర్భంలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్లేట్ ని మార్ఫింగ్ చేసినట్లుగా తెలుస్తోంది.
టీవీ9 వార్తా సంస్థ వారు కూడా తమ న్యూస్ ఛానెల్ యొక్క బ్రేకింగ్ ప్లేట్ ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కొందరు సెలవులు ఈ నెల 31వరకు పెంచినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమ వెబ్సైటు లో పేర్కొంది. మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసినట్టు అందులో ఉంది.
చివరగా, తెలంగాణా ప్రభుత్వం దసరా సెలవులను ఈ నెల 31 వరకు పెంచలేదు. అలా ఉన్న టీవీ9 వారి బ్రేకింగ్ న్యూస్ ప్లేట్ మార్ఫింగ్ చేయబడింది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: తెలంగాణా ప్రభుత్వం దసరా సెలవులను ఈ నెల 31 వరకు పెంచలేదు - Fact Checking Tools | Factbase.us