Fake News, Telugu
 

సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరానికి వెయ్యి రూపాయులు కడితే ఆరు లక్షల రూపాయులు రావు

1

కేంద్ర ప్రభుత్వ సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరానికి వెయ్యి రూపాయుల చొప్పున 14 సంవత్సరాలు కడితే 21 సంవత్సరాల తర్వాత ఆరు లక్షల రూపాయులు బ్యాంకు తిరిగి చెల్లిస్తుందని చెప్తూ ఒక పోస్ట్ ఫేస్బుక్ లో షేర్ అవుతుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరానికి వెయ్యి రూపాయుల చొప్పున 14 సంవత్సరాలు కడితే 21 సంవత్సరాల తర్వాత ఆరు లక్షల రూపాయులు బ్యాంకు తిరిగి చెల్లిస్తుంది.

ఫాక్ట్ (నిజం): సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరానికి వెయ్యి రూపాయులు చొప్పున 14 సంవత్సరాలు కడితే 21 సంవత్సరాల తర్వాత సుమారు యాభై వేల రూపాయులు బ్యాంకు తిరిగి చెల్లిస్తుంది, ఆరు లక్షలు కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో ఇచ్చిన సుకన్య యోజన పథకం గురించి గూగుల్ లో వెతకగా, ‘సుకన్య సమృద్ధి యోజన’ పేరుతో ప్రభుత్వ పథకం ఒకటి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పథకానికి సంబంధించిన వివరాలను ‘Vikaspedia’ అనే ప్రభుత్వ వెబ్ సైట్ లో చూడవొచ్చు. ఈ పథకానికి సంబంధించి ఆర్బీఐ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ని ఇక్కడ చదవొచ్చు.

‘Vikaspedia’ వెబ్ సైట్ లో ఇచ్చిన ఉదాహరణలో సంవత్సరానికి పన్నెండు వేలు 14 సంవత్సరాలు కడితే 21 ఏళ్ళ తర్వాత సుమారు 6 లక్షలు వస్తాయని ఉంటుంది, కానీ పోస్ట్ లో మాత్రం సంవత్సరానికి కేవలం వెయ్యి రూపాయులు కట్టినా 21 ఏళ్ళ తర్వాత 6 లక్షలు వస్తాయని ఉంది. ‘The Economic Times’ వారి వెబ్ సైట్ లో ఉన్న ‘సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్’ లో 8.5 వడ్డీ రేటుతో (వడ్డీ రెట్లు మారుతూ ఉన్నట్టుగా ‘National Saving Institute’ వెబ్ సైట్ లో చూడవొచ్చు) సంవత్సరానికి వెయ్యి రూపాయులు కడితే సుకన్య సమృద్ధి యోజనలో 21 సంవత్సరాలకి ఎంత డబ్బు వస్తుందో లెక్కిస్తే, సుమారు యాబై వేల రూపాయల వరకు వస్తుందని తెలుస్తుంది. పోస్ట్ లో చెప్పినట్టు ఆరు లక్షలు రావు.

చివరగా, సుకన్య సమృద్ధి యోజన పథకంలో సంవత్సరానికి వెయ్యి రూపాయులు కడితే ఆరు లక్షల రూపాయులు రావు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll