Fake News, Telugu
 

అయోధ్యలో కట్టబోయే రామ మందిరం పరిసరాల్లో టైంక్యాప్సుల్ ఏర్పాటు చేయట్లేదు.

0

అయోధ్యలో కట్టబోయే రామ మందిర పరిసరాల్లో 2000 అడుగుల లోతులో ఒక టైంక్యాప్సుల్ పూడ్చి పెడుతున్నారని, ఈ టైంక్యాప్సుల్ ని 2957వ సంవత్సవరం వరకి బయటికి తీయరని అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అయోధ్యలో కట్టబోయే రామ మందిర పరిసరాల్లో 2000 అడుగుల లోతులో ఒక టైంక్యాప్సుల్ పూడ్చి పెడుతున్నారు.

ఫాక్ట్ (నిజం): అయోధ్యలో కట్టబోయే రామ మందిర ప్రాంతంలో ఎటువంటి టైంక్యాప్సుల్ ఏర్పాటు చేయట్లేదని శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అయిన చంపత్ రాయి ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. పైగా పోస్టులో షేర్ చేసిన ఫోటో 2015లో అమెరికాలోని ప్రఖ్యాత MIT యూనివర్సిటీ లో ఒక నూతన భవన నిర్మాణంలో భాగంగా జరిపిన తవ్వకాల్లో దొరికిన టైంక్యాప్సుల్. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వార్తకి సంబంధించి మరింత సమాచారం వెతికే క్రమంలో మాకు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అయిన చంపత్ రాయి ఈ వార్తకి సంబంధించి వివరణ ఇస్తూ చేసిన ట్వీట్ ఒకటి మాకు కనిపించింది. ఈ ట్వీట్ ద్వారా టైంక్యాప్సుల్ ఏర్పాటు చేస్తునట్టు వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని మరియు ఇలాంటి వార్తలని నమ్మొద్దని స్పష్టం చేసారు. దీనికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చదవొచ్చు.

ఫోటో 1:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇది ఒక సాధారణ టైంక్యాప్సుల్ నమూనా అని, దీనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదని తెలిసింది. ఇలాంటి టైంక్యాప్సుల్ నమూనాలు అమెజాన్ లో కూడా లభ్యమవుతున్నాయి.

ఫోటో 2:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటో 2015లో అమెరికాలోని ప్రఖ్యాత MIT యూనివర్సిటీ లో ఒక నూతన భవన నిర్మాణంలో భాగంగా జరిపిన తవ్వకాల్లో దొరికిన టైంక్యాప్సుల్ అని తెలిసింది. ఈ టైంక్యాప్సుల్ పై 2957 A.D వరకి తెరవకూడదని స్పష్టంగా రాసి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఈ ఫోటోని చూపిస్తూ అయోధ్యలో కట్టబోయే రామ మందిరం పరిసరాల్లో ఒక టైంక్యాప్సుల్ ఏర్పాటుచేస్తున్నారని, దానిని 2957వ సంవత్సరం వరకి తెరవకుడదని ప్రచారం చేస్తున్నారు. దీన్నిబట్టి పోస్టులో చూపిస్తున్న ఈ ఫోటోకి అయోధ్యలో కట్టబోయే రామ మందిరానికి ఎటువంటి సంబంధంలేదని చెప్పొచ్చు.

ఐతే, 27 జూలై 2020న శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడైన కామేశ్వర్ చౌపల్ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో కట్టబోయే రామ మందిర ప్రాంతంలో 2000 అడుగుల లోతులో ఒక టైంక్యాప్సుల్ పూడ్చి పెడతామని చెప్పిన నేపధ్యంలో ఈ వార్త వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ చదవొచ్చు మరియు వీడియో ఇక్కడ చూడొచ్చు.

చివరగా, వీటన్నిటి ఆధారంగా అయోధ్యలో కట్టబోయే రామ మందిరం ప్రాంతంలో ఎటువంటి టైంక్యాప్సుల్ ఏర్పాటు చేయట్లేదు అని కచ్చితంగా చెప్పొచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll