Fake News, Telugu
 

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ట్వీట్ ద్వారా భారతీయులకు క్షమాపణలు చెప్పాడు అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది ఫేక్ స్క్రీన్ షాట్

0

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై తన మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, భారతీయులకు క్షమాపణలు చెబుతున్నట్లు ఉన్న ఒక ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ ట్వీట్ తాను 07 జనవరి 2024 నాడు చేసాడు అని వైరల్ ఫోటోలో చూడొచ్చు. ఈ కథనం ద్వారా దీని వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకొందాం. 

క్లెయిమ్:  ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై తన మంత్రులు చేసిన వ్యాఖ్యలకు భారతీయులకు క్షమాపణలు కోరుతూ మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ చేసిన ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్. 

నిజం(ఫాక్ట్): మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ట్వీట్‌లో భారతీయులకు క్షమాపణలు చెప్పలేదు. తన అఫీషియల్ ‘X’ హ్యాండిల్ నుండి ఆఖరి ట్వీట్ 05 జనవరి 2024న పోస్ట్ చేయబడింది, ఇది భారతీయులకు క్షమాపణలు చెబుతున్న ట్వీట్ కాదు.  సోషల్ మీడియా అకౌంటుల పోస్టింగ్ యాక్టివిటీని పర్యవేక్షించే ఆన్‌లైన్ సాధనాలు కొన్ని ఈ ట్వీటే ఈ ఫాక్ట్-చెక్ రాసే సమయానికి తన ఆఖరి ట్వీటుగా సూచిస్తున్నాయి.  కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రి ఒకరు అవమానకరమైన ట్వీట్‌ను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. ఈ సంఘటనలను పరిగణనలోకి తీసుకున్న మాల్దీవుల ప్రభుత్వం, వారు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు ముగ్గురు డిప్యూటీ మంత్రులను సస్పెండ్ చేయడం ద్వారా చర్య తీసుకుంది.

సోషల్ మీడియాలో మంత్రి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వం మాట్లాడుతూ, ఈ అభిప్రాయాలు వ్యక్తిగతమని, అవి మాల్దీవుల ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని చెప్పారు. 

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూకు ఆపాదిస్తూ ఈ వైరల్ ట్వీట్ విస్తృతంగా ప్రచారం చేయబడుతోంది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు ట్వీట్‌ను నిజంగా చెయ్యలేదు. వైరల్ స్క్రీన్‌షాట్ కల్పితమని, డిజిటల్‌గా రూపొందించబడి ఉండవచ్చు అని మా రీసెర్చ్ ద్వారా మేము కనుగొన్నాం.

మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెతికితే 07 జనవరి 2024 నాటిదిగా చెప్పి వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్‌ మాదిరిగా ఉన్న కంటెంట్‌తో సరిపోయే ట్వీట్ ఏదీ మాకు కనిపించలేదు. ఈ ఫాక్ట్-చెక్ రాసే సమయానికి ఈ ఖాతా నుంచి ఆఖరి ట్వీట్ 05 జనవరి 2024న పోస్ట్ చేయబడింది.

ఒక సోషల్ మీడియా అకౌంట్ లో డిలీట్ చేసిన పోస్టులతో పాటు, అన్ని పోస్టింగ్ కార్యకలాపాన్ని పర్యవేక్షించే టూల్ సోషల్ బ్లేడ్‌ని ఉపయోగించి మొహమ్మద్ ముయిజ్జూ ట్విట్టర్ పోస్టుల గురించి చెక్ చేయగా, ముయిజ్జు 07 జనవరి 2024 తర్వాత ఎలాంటి ట్వీట్‌ను డిలీట్ చెయ్యలేదు అని తెలిసింది.  

అదనంగా, ట్విట్టర్ అడ్వాన్సడ్ సెర్చ్ ద్వారా అతని ట్వీట్‌లకు వచ్చిన రెప్లైయలు కనుగొనడానికి తగిన ఫిల్టర్‌లతో వెతకగా,  అతనికి వచ్చన ఆఖరి రెప్లైయలు అతని 05 జనవరి 2024 ట్వీట్‌కి సంబంధించినవని తెలిసింది.  అతను 07 జనవరి 2024న ఎటువంటి ట్వీట్‌లను పోస్ట్ చేయకపోవచ్చని దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అదనంగా, మాల్దీవుల అధ్యక్షుడు నిజంగా ఇలాంటి ట్వీట్ చేసి ఉంటే, అది మీడియా ద్వారా తప్పకుండా రిపోర్టు చెయ్యబడేది. అయితే, మాకు ఈ విషయంపై ఎటువంటి వార్త కథనాలు దొరకలేదు. వీటన్నిటిని బట్టి వైరల్ అవుతోన్న స్క్రీన్‌షాట్ ఎడిట్ చేసి రూపొందించారు అని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరిగా, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఒక ట్వీట్‌ ద్వారా భారతీయులకు క్షమాపణలు చెప్పాడు అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది ఫేక్ స్క్రీన్ షాట్.

Share.

About Author

Comments are closed.

scroll