Coronavirus Telugu, Fake News, Telugu
 

కరోనా వైరస్ నేపథ్యంతో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా రాసిన ఈ కథనాలను అంతర్జాతీయ జర్నలిస్టులు రాయలేదు

0

భారతదేశం, కరోనా వైరస్ మహమ్మారి తోనే కాకుండా, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి నిరాశ నిస్ప్రుహలోకి నెట్టేసే రాబందుల లాంటి జర్నలిస్టులతో పోరాడుతుందనే హెడ్లైన్ తో ఆస్ట్రేలియా న్యూస్  సంస్థ ‘Australia Today’ ఆర్టికల్ పబ్లిష్ చేసిందని సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. అలాగే, నరేంద్ర మోదీ కరోనా నియంత్రణ చర్యలని కొనియాడుతూ ‘The Daily Guardian’ అనే అంతర్జాతీయ న్యూస్ సంస్థ ఆర్టికల్ పబ్లిష చేసినట్టు మరికొందరు పోస్టులు పెడుతున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా వైరస్ సెకండ్ వేవ్  నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా కథనాలను ప్రచురించిన అంతర్జాతీయ మీడియా.

ఫాక్ట్ (నిజం): భారత దేశ జర్నలిస్టులు ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తున్నట్టు పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని  ఆస్ట్రేలియా దేశంలో రిజిస్టర్ అయిన ‘The Australia Today’ అనే డిజిటల్ పోర్టల్ పబ్లిష్ చేసింది. ఈ డిజిటల్ పోర్టల్ వ్యవస్థాపకులు భారత దేశానికి చెందిన వారని తెలిసింది. ఈ ఆర్టికల్ ని ఆస్ట్రేలియాకి చెందిన మీడియా సంస్థలు పబ్లిష్ చేయలేదని ABC న్యూస్ సంస్థ సౌత్ ఆసియా కరెస్పాండంట్ జేమ్స్ ఒతేన్ స్పష్టం చేసారు. అలాగే, భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా నియంత్రణ చర్యలను  వివరిస్తూ పబ్లిష్ చేసిన మరొక ఆర్టికల్ ని భారత దేశానికి చెందిన ‘The Daily Guardian’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసింది. ఈ న్యూస్ సంస్థకి ఇంగ్లాండ్ కి చెందిన ప్రఖ్యాత ‘The Guardian’ సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆర్టికల్-1:

పోస్టులో షేర్ చేసిన ఈ ఆర్టికల్ కోసం కొన్ని పదాలు వాడి గూగుల్ లో వెతికితే, ‘The Australia Today’ పేరుతో ఆస్ట్రేలియా దేశంలో రిజిస్టర్ చేసిన ఒక డిజిటల్ పోర్టల్, ఈ ఆర్టికల్ ని 12 మే 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘The Australia Today’ డిజిటల్ న్యూస్ పోర్టల్ వివరాల కోసం About సెక్షన్ లో వెతకగా, ఈ డిజిటల్ పోర్టల్ వ్యవస్థాపకులు భారత సంతతికి చెందిన వారని తెలిసింది. ఆస్ట్రేలియా మరియు భారత ఉపఖండంలో జరిగే ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి తాము ఆర్టికల్స్ పబ్లిష్  చేస్తామని ఈ పోర్టల్ వెబ్సైటులో తెలిపారు. ఈ డిజిటల్ పోర్టల్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ‘Whois’ వెబ్సైటులో లభించాయి.

ఈ ఆర్టికల్ ని మొట్టమొదటగా ‘TRUNICLE’ అనే భారతదేశానికి చెందిన న్యూస్ సంస్థ పబ్లిష్ చేసింది. దీన్ని ‘The Australia Today’ వారు రీ-పబ్లిష్ చేసారు. ఇది వారు సొంతంగా రాసింది కాదు. ఈ ఆర్టికల్ రాసిన మనీషా ఇనాందార్, ఇదివరకు ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి మద్దతు తెలుపుతూ చాలా ఆర్టికల్స్ రాసినట్టు తెలిసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆర్టికల్ కు సంబంధించి ABC న్యూస్ సంస్థ సౌత్ ఆసియా కరెస్పాండంట్ జేమ్స్ ఒతేన్ 11 మే 2021 నాడు ఒక ట్వీట్ పెట్టారు. ఈ ఆర్టికల్ ని ఆస్ట్రేలియాకి వార్తా సంస్థలు పబ్లిష్ చేయలేదని జేమ్స్ ఒతేన్ తన ట్వీట్ లో స్పష్టం చేసారు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన ‘The Ausralian’ న్యూస్ సంస్థ, భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ నియంత్రించడంలో విఫలమయ్యారని తెలుపుతూ 25 ఏప్రిల్ 2021 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలోనే భారతీయు డిజిటల్ పోర్టల్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఆస్ట్రేలియా మీడియా సంస్థలు పబ్లిష్ చేసిన ఆర్టికల్ గా షేర్ చేస్తున్నారు. 

ఆర్టికల్-2:

కరోనా వైరస్ నియంత్రణ కోసం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలుపుతూ ‘The Daily Guardian’ న్యూస్ సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసిందని బీజేపీ నాయకులు కూడా 10 మే 2021 నాడు ట్వీట్లు పెట్టారు. ఆ ట్వీట్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఈ ఆర్టికల్ ని పబ్లిష్ చేసిన The Daily Guardian’ న్యూస్ సంస్థ, భారతీయ మీడియా సంస్థ ‘ITV Network’ లో భాగమని ‘Whois’ వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు. ఈ ఆర్టికల్ ని ‘The Daily Guardian’ న్యూస్ సంస్థ 11 మే 2021 నాడు పబ్లిష్ చేసింది. ఈ న్యూస్ సంస్థకి ఇంగ్లాండ్ కి చెందిన ప్రఖ్యాత ‘The Guardian’ మీడియా సంస్థతో ఎటువంటి సంబంధం లేదు. ఈ ఆర్టికల్ ని రాసింది బీజేపి నేషనల్ మీడియా టీమ్ సభ్యుడు సుదేష్ వర్మ అని తెలిసింది. సుదేష్ వర్మ ఇంతకకముందు ‘Narendra Modi: The Game Changer’ అనే పుస్తకాన్ని రాసారు. బీజేపీ మంత్రులు షేర్ చేసిన ‘The Daily Guardian’ ఆర్టికల్ పై స్పష్టతనిస్తూ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, కరోనా వైరస్ నేపథ్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా రాసిన ఈ కథనాలను అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll