Fake News, Telugu
 

ఈ వీడియోలో కనిపిస్తున్న మసీదుని ఇజ్రాయిల్ సైన్యం కూల్చేయలేదు

0

ఇటీవల ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక మసీదు లాంటి భవనాన్ని బాంబులతో కుల్చేసినట్టు ఉన్న ఒక వీడియోని, ఇజ్రాయిల్ సైన్యం కుల్చేసినట్టు అర్ధం వచ్చేలా హ్యాష్‌ట్యాగ్‌ లతో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ పోస్టులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇప్పుడు ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడుల సందర్భంలో ఇజ్రాయిల్ సైన్యం మసీదును కూల్చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని విజువల్స్ ని 2014 లో ‘CNN TURK’ వారు ప్రచురించిన వార్తా కథనంలో చూడవొచ్చు. వీడియోలోని బిల్డింగ్ సిరియాలో ఉందని, దానిని ISIS ఉగ్రవాద సంస్థ అప్పట్లో పెల్చేసినట్టు తెలిసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోలో ఉన్న మసీదు భవనాన్ని కూల్చేసే విజువల్స్ ని 2016లో రష్యా అధికారిక వార్తా సంస్థ RT ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఐతే ఈ కథనంలో ఈ విజువల్స్ ఏ సంఘటనకు సంబంధించినవో ఈ వీడియోలో పేర్కొనలేదు.

అయితే, వేరే సెర్చ్ రిజల్ట్స్ లో వీడియోలోని బిల్డింగ్ సిరియా లోని వీసెల్ కరణి సమాధి బిల్డింగ్ అని రాసి ఉంది. ఆ సెర్చ్ రిజల్ట్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఆ పేరుతో వెతకగా, 2014 లో పోస్ట్ లోని వీడియోనే పెట్టి, ‘CNN TURK’ వారు ప్రచురించిన వార్తా కథనం లభించింది. వీడియోలోని బిల్డింగ్ ని ISIS ఉగ్రవాద సంస్థ అప్పట్లో పెల్చేసినట్టు ఆ వార్తా కథనంలో చదవొచ్చు. కావున, పోస్ట్ లోని వీడియోకీ, ఇప్పుడు ఇజ్రాయిల్- పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడులకు అసలు సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, ఈ వీడియోలో కనిపిస్తున్న మసీదుని ఇజ్రాయిల్ సైన్యం కూల్చేయలేదు.

వివరణ (MAY 15, 2021):

ఈ ఆర్టికల్ మొదటిగా ప్రచురించినప్పుడు వీడియోలోని బిల్డింగ్ కి సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. వీడియోకి సంబంధించిన అదనపు వివరాలతో ఈ ఆర్టికల్ మార్చబడింది.

Share.

About Author

Comments are closed.

scroll