Fake News, Telugu
 

బాబా రాందేవ్ పాత ఫోటోని చూపించి ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నట్టు షేర్ చేస్తున్నారు

0

ఆసుపత్రిలో బాబా రాందేవ్ కొంతమందితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలోచాలా మంది షేర్ చేస్తున్నారు. ఊపిరి బిగపట్టి ఉచ్వాస నిశ్వాస గురించి చెప్పే వ్యక్తే ఇవాళ వెంటిలేటర్ పై ఉన్నాడని, కరోనా కు మందు కనిపెట్టాము అన్నవారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: కరోనా చికిత్స తీసుకుంటున్న బాబా రాందేవ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫోటో.

ఫాక్ట్: బాబా రాందేవ్ ఉన్న ఈ ఫోటో 2011 నాటిది. నల్ల ధనానికి వ్యతిరేకంగా బాబా రాందేవ్ 2011లో దీక్ష చేసారు. తొమ్మిది రోజుల తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించటంతో డెహ్రాడూన్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు, ఈ ఫోటో అప్పుడు తీసినదే. ప్రస్తుతం బాబా రాందేవ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్ లో ఉన్న ఫోటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఇండియా టుడే ఫోటో కలెక్షన్ కు డైరెక్ట్ చేసింది. బాబా రాందేవ్ కి సంబంధించి మరిన్ని ఫోటోలు ఆ ఫోటో కలెక్షన్ లో లభించాయి. ఆ ఫోటో కలెక్షన్ లోని వివరణలో ఈ సంఘటన బాబా రాందేవ్ జూన్ 2011లో నల్ల ధనానికి వ్యతిరేకంగా చేసిన ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించినదిగా పేర్కొన్నారు. తొమ్మిది రోజుల తరువాత బాబా రాందేవ్ ఆరోగ్యం క్షీణించటంతో అతన్ని డెహ్రాడూన్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఇతర ప్రముఖ మత, ఆధ్యాత్మిక పెద్దల సమక్షంలో తన దీక్షను విరమించారు. పోస్ట్ లోని ఫోటో అప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు తీసిన ఫొటోనే.

ఇంకా ఈ సంఘటన గురించి గూగుల్ సెర్చ్ చేసినప్పుడు, 2011 నాటి న్యూస్ ఆర్టికల్స్ కొన్ని లభించాయి. ఆ ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. బాబా రాందేవ్ దీక్ష విరమిస్తున్నట్టు NDTV వారి న్యూస్ వీడియో కూడా మనము చూడొచ్చు.

ఇటీవల బాబా రాందేవ్ ఆసుపత్రిలో చేరినట్టు మాకు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ దొరకలేదు. ఇటీవల కాలంలో బాబా రాందేవ్ తన ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ అకౌంట్ ల ద్వారా బాగా ఆక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

చివరగా, బాబా రాందేవ్ ఉన్న పాత ఫోటోని చూపించి ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll