Fake News, Telugu
 

తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్టు ఆధారాలు లేవు

0

తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతుందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పింది.

ఫాక్ట్: తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే అనుకుని కొన్ని తాళపత్ర గ్రంథాలలో రాసినవి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో పుట్టారని చరిత్రలో ఉంది. అప్పటికింకా తెలుగు రాష్ట్రం అనే రాష్ట్రం లేనేలేదు. ఇప్పుడు కూడా ఉన్నవి రెండు తెలుగు రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ; ఒకటి కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.           

బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే అనుకుని కొన్ని తాళపత్ర గ్రంథాలలో రాసినవి. మాకు ఇంటర్నెట్‌లో బ్రహ్మంగారి కాలజ్ఞానానికి సంబంధించి దొరికిన రెండు పుస్తకాల్లో ఎందులో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఉన్నట్టు లేదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మటం వారు ప్రచురించిన ‘కాలజ్ఞానం’ మరియు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడని లేదు.

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో పుట్టారని చరిత్రలో ఉంది. అప్పటికింకా తెలుగు రాష్ట్రం అనే రాష్ట్రం లేనేలేదు. ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ- ఉన్నాయి; ఒకటి కాదు.

చిన్న కవిత లాగా రాసి ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్ర దోషం అంటూ, మరియు కరోనా సమయంలో కూడా కరోనా వస్తుందని బ్రహ్మంగారు చెప్పారని సోషల్ మీడియాలో వైరల్ చేసారు. 2019 ఎన్నికల సమయంలో వైరల్ అయిన ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’ వాక్యాలేవి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రచురించిన పుస్తకాలలో లేవని బీబీసీ తెలుగు ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, తెలుగు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్టు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll