Fake News, Telugu
 

2024 ఎన్నికల్లో NDA మీద INDIA కూటమికే ప్రజల మద్దతు ఉండబోతోంది అని ఒక ఎడిటెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఆజ్ తక్ న్యూస్ యాంకర్ చిత్రా త్రిపాఠి తన షోలో, News 24 ఛానెల్ వాళ్ళు NDA మరియు INDIA కూటముల మధ్య ఎవరు 2024 ఎన్నికలలో నెగ్గుతారు అని చేపట్టిన ఒక సర్వేలో INDIA కూటమికి 80% కి పైన, NDAకి 14% మద్దతు వచ్చింది అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం. 

క్లెయిమ్: 2024 ఎన్నికల్లో, NDAతో పోలిస్తే INDIA కూటమికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది అని ఆజ్ తక్ న్యూస్ యాంకర్ చిత్రా త్రిపాఠి తన షోలో చెప్పారు.

 ఫాక్ట్(నిజం): ఇది ఒక ఎడిటెడ్ వీడియో. ఆజ్ తక్ న్యూస్ యాంకర్ చిత్రా త్రిపాఠి యొక్క షో దంగల్ క్లిప్ పైన Indian National Congress యూట్యూబ్ ఛానల్లో, News 24 ఛానెల్ వాళ్ళు NDA మరియు INDIA కూటముల మధ్య 2024 ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు అని చేపట్టిన ఒక సర్వే గురించి చేసిన వీడియో ఆడియోని పెట్టి ఎడిట్ చేసిన వీడియో ఇది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 


ముందుగా ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, కాంగ్రెస్ పార్టీ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్ “Indian National Congress“లో అప్లోడ్ చేసిన ఒక వీడియో దొరికింది (ఇది కూడా చుడండి).

2024 ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు అని News 24 ఛానల్ వారు చేపట్టిన ఒక సర్వేలో ప్రజలు NDA కంటే ఎక్కువగా INDIA కూటమికి మద్దతు ఇచ్చారు అని ఈ వీడియోలో విషయం. సరిగ్గా గమనించగా, ఇందులో ఉన్న ఆడియో వైరల్ వీడియోలో ఉంది అని అర్ధం అయ్యింది. 

తదుపరి, వైరల్ వీడియోలో యంకార్ చిత్రా త్రిపాఠి మాట్లాడుతుంటే, లిప్ సింక్ సరిగ్గా రావట్లేదు అని స్పష్టంగా అర్థం అవుతుంది. తగిన కీ వర్డ్స్ ఉపయోగించి తను ఆజ్ తక్ ఛానల్లో చేసే దంగల్ అనే షో యొక్క వీడియోలు యూట్యూబ్‌లో వెతుకగా, ఈ ఏడాది 21 July నాడు ఆజ్ తక్ అప్లోడ్ చేసిన రెండు వీడియోలలో (ఇక్కడ, ఇక్కడ) తను వైరల్ వీడియోలో ధరించిన డ్రెస్ వేసుకొని ఉన్నారు.

ఈ రెండిట్లో ఏదో ఒక వీడియో క్లిప్ పైన Indian National Congress యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియో యొక్క ఆడియోను జోడించి, వైరల్ వీడియోను ఎడిట్ చేశారు. 

చివరిగా, 2024 ఎన్నికల్లో NDA మీద INDIA కూటమికే ప్రజల మద్దతు ఉండబోతోంది అని ఒక ఎడిటెడ్ వీడియో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll