JNU (జవహార్ లాల్ నెహ్రు యూనివర్సిటీ) యొక్క హాస్టల్ ఫీ పెంచారన్న కోపంతో ఒక పేద విద్యార్ధి లక్ష రూపాయల విలువైన ఐఫోన్ ని పగలగొట్టాడని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ ఫేస్బుక్ లో ప్రచారం కాబడుతుంది. ఆ క్లెయిమ్ లో ఎంత వరకు నిజం ఉందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: JNU హాస్టల్ ఫీ పెంచారు అని కోపంతో ఐఫోన్ 11 ని పగలగొట్టిన ఒక విద్యార్ధి.
ఫాక్ట్ (నిజం): JNU హాస్టల్ ఫీ పెంచారన్న కోపం తో ఒక విద్యార్ధి ఐఫోన్ 11ని పగలగొట్టాడని పోస్ట్ లో పేర్కొన్న వార్తని ప్రచురించింది ‘The Fauxy’ అనే ఒక సెటైర్ వెబ్ పోర్టల్. ఈ వెబ్సైటు లోనే వారు ప్రచురించే వార్తలు ఏవీ నిజం కాదు అని, అన్నీ కల్పితం అని పేర్కొన్నారు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
పోస్ట్ లోని వార్త గురించి గూగుల్ లో కీవర్డ్స్ ఉపయోగించి వెతికితే, ‘The Fauxy’ వారు తప్పితే వేరే ఏ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు JNU హాస్టల్ ఫీ పెంచారని ఒక విద్యార్ధి ఐఫోన్ ని పగలగొట్టాడన్న వార్తను ప్రచురించలేదు అని తెలిసింది. నవంబర్ 11, 2019న ‘The Fauxy’ ప్రచురించిన ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ‘The Fauxy’ వైబ్సైట్ లో వారు తమ గురించి ఇచ్చిన వివరణ లో వారు వెబ్సైటులో రాసేది కల్పితం అని, అవి ఏవీ నిజం కాదు అని ఉంటుంది.
అంతేకాక, ‘The Fauxy’ ట్విట్టర్ అకౌంట్ లో కూడా వారు తమ వార్తలు కల్పితం అని పేర్కొనడం గమనించవచ్చు. వ్యంగ్యంగా రాసిన ఈ వార్తని తీసుకొని నిజంగా జరిగింది అనుకొని షేర్ చేస్తున్నారు.
చివరగా, JNU హాస్టల్ ఫీ పెంచారన్న కారణం వళ్ళ ఏ విద్యార్ధి ఐఫోన్ ని పగలగొట్టలేదు. ఇది ‘The Fauxy’ అనే సెటైర్ వెబ్ పోర్టల్ వాళ్ళు వ్యంగ్యంగా రాసిన ఒక వార్త.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: JNU హాస్టల్ ఫీ పెంచినందుకు కోపంతో ఒక విద్యార్ధి ఐఫోన్ పగలగొట్టాడని వ్యంగ్యంగా రాసిన వార్తని నిజ