Fake News, Telugu
 

భారతదేశంపై మొదటి హక్కు స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మాత్రమే ఉంటుందని తమిళ నటుడు అజిత్ అనలేదు

0

భారతదేశంపై మొదటి హక్కు ఎవరి పూర్వీకులు బ్రిటిష్ వారి నుండి దేశాన్ని విముక్తి చేశారో వారికే చెందుతుంది. బ్రిటీష్ వారితో కలిసి దేశానికి వ్యతిరేకంగా ఉన్న మిగిలిన వారు మౌనంగా ఉండాలి లేదా దేశం విడిచిపెట్టాలి”, అని ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ వ్యాఖ్యానించారని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మాత్రామే భారత దేశంపై మొదటి హక్కు ఉంటుందని, తమిళ నటుడు అజిత్ కుమార్ వ్యాఖ్యానించారు.  

ఫాక్ట్ (నిజం): భారతదేశంపై మొదటి హక్కు స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మాత్రామే ఉంటుందని గానీ, స్వాతంత్య్రనికి ముందు బ్రిటిష్ వారితో కలిసి దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు మౌనంగా ఉండాలి లేదా దేశం విడిచి పెట్టి వెళ్లాలని గానీ అజిత్ కుమార్ ఎన్నడూ అనలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో తెలుపుతున్నట్టు స్వాతంత్య్ర సమరయోధుల వారసుల హక్కుల గురించి నటుడు అజిత్ కుమార్ వ్యాఖ్యలు చేశారా అని కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, అజిత్ కుమార్ అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదని తెలిసింది. ఒకవేళ అజిత్ కుమార్, భారతదేశంపై మొదటి హక్కు స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మాత్రామే ఉంటుందని, స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారితో కలిసి దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వారు దేశం విడిచి పెట్టి వెళ్లాలని అని ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి.  

అజిత్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలను అతని మేనేజర్ సురేశ్ చంద్ర తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తుంటారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసుల హక్కులకు సంబంధించి అజిత్ కుమార్ ప్రకటన విడుదల చేసినట్టుగా సురేశ్ చంద్ర తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఎటువంటి ట్వీట్ పెట్టలేదు.

అజిత్ కుమార్ పలు సార్లు తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తనని ఏవిధంగా కూడా రాజకీయాలకు ముడిపెట్టవద్దని పలు ప్రకటనల ద్వారా స్పష్టం చేశారు. అజిత్ కుమార్‌ పాత ఇంటర్వ్యూ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుకి సంబంధించిన స్పష్టత కోసం మేము సురేశ్ చంద్రను సంప్రధించాము. ఆయన నుంచి స్పష్టత వచ్చిన వెంటనే ఈ ఆర్టికల్‌ను అప్డేట్ చేస్తాము.

చివరగా, భారతదేశంపై మొదటి హక్కు స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మాత్రమే ఉంటుందని తమిళ నటుడు అజిత్ కుమార్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll