Fake News, Telugu
 

ఫోటోలో కనిపిస్తున్న ఛత్రపతి శివాజీ చిత్రపఠం లండన్ మ్యుజియంలో పొందుపరిచినది కాదు

0

లండన్ మ్యుజియంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒరిజినల్ చిత్రపఠం అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లండన్ మ్యుజియంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒరిజినల్ చిత్రపఠం ఫోటో.

ఫాక్ట్ (నిజం): లండన్ లోని ‘The British Museum’లో ఛత్రపతి శివాజీ పెయింటింగ్ ఉన్న మాట వాస్తవమే కాని, మ్యుజియంలోని ఆ పెయింటింగ్ పోస్టులో చూపిస్తున్న ఈ పెయింటింగ్ ఒకటి కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఆ చిత్రపఠం కోసం ‘The British Museum’ వెబ్సైటులో వెతకగా, అదే చిత్రం కలిగి ఉన్న చిత్రపఠం ఏది ఈ మ్యుజియంలో లేదు అని తెలిసింది. లండన్ లోని ‘The British Museum’లో ఛత్రపతి శివాజీ పెయింటింగ్ ఉన్న మాట వాస్తవమే కాని, మ్యుజియంలోని ఆ పెయింటింగ్ పోస్టులో చూపిస్తున్న పెయింటింగ్ ఒకటి కాదు. ‘The British Museum’ లోని ‘Potrait of Indian Princes’ ఆల్బమ్ లో పొందుపరిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పెయింటింగ్ ని ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన ఆ  చిత్రపఠం ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే చిత్రం కలిగి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ‘Bharat Gyan’ బ్లాగ్ వారు రాసిన ఒక ఆర్టికల్ దొరికింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర గురించి రాసిన ఈ ఆర్టికల్ లో, వి ఎస్ బెంద్రే  అనే చరిత్రకారుడు ఈ చిత్రపఠంని కనుగొన్నట్టు తెలిపారు.

కాకపోతే, ఈ చిత్రం వాసుదేవ్ సీతారాం బెంద్రే కనుగొన్నది కూడా కాదని మా విశ్లేషణలో తెలిసింది. వాసుదేవ్ సీతారాం బెంద్రే మహారాష్ట్రకి చెందిన ఒక ప్రముఖ చరిత్ర కారుడు. సంభాజీ మహారాజ్, తుకారాం మహారాజ్, శివాజీ మహారాజ్ మీద చాలా పరిశోధనలు అయన చేసారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అసలు చిత్రం మొదట కనుగొన్నది కూడా అతనే. 1664 AD లో అప్పటి సూరత్ డచ్ గవర్నర్ వోన్ వాలెంటీన్ శివాజీ తదితరుల చిత్రాలు గీయించాడు. అవే చిత్రాలని వాసుదేవ్ సీతారాం బెంద్రే యూరప్ లో వెతికి 1933లో మొదటిసారి ప్రచురించాడు. అప్పటిదాకా అందరూ ఒక ముస్లిం సర్దార్ ఫోటోని శివాజీ మహారాజ్ ఫోటో అనుకునే వారు. వాసుదేవ్ సీతారాం బెంద్రే ప్రచురించిన ఆ శివాజీ మహారాజ్ చిత్రమే ఇప్పటికి అందరూ వాడేది.

చివరగా, ఫోటోలో కనిపిస్తున్న చత్రపతి శివాజీ చిత్రపఠం లండన్ మ్యుజియంలో పొందుపరిచినది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll