1989 నుండి జే.ఎన్.యూ లోనే రీసెర్చ్ విద్యార్ధిగా ఉంటున్న కేరళకి చెందిన 47 ఏళ్ళ మొయినుద్దీన్ యొక్క ఫోటో అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: 1989 నుండి జే.ఎన్.యూ లో చదువుతున్న 47 ఏళ్ళ మొయినుద్దీన్ ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న జే.ఎన్.యూ విద్యార్థి పేరు ‘పంకజ్’, పోస్ట్ లో చెప్పినట్టు ‘మొయినుద్దీన్’ కాదు. 1989 నుండి తను జే.ఎన్.యూ లో చదవట్లేదు. తన వయస్సే 30 సంవత్సరాలు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో పెట్టిన ట్వీట్ మీద కామెంట్ చేస్తూ, ఆ ఫోటోలో ఉన్నది తనేనని ‘Pankaj Anarchico’ అనే యూసర్ ట్వీట్ చేసాడు. తను జే.ఎన్.యూ లో ‘Center of Social Medicine and Community Health’ కి చెందిన రీసెర్చ్ స్కాలర్ అని ఆ ట్వీట్ ద్వారా తెలిపాడు. అంతేకాదు, ‘janjwar’ అనే న్యూస్ వెబ్ సైట్ వారు ఫేస్బుక్ లో పెట్టిన వీడియో లో కూడా తన పేరు ‘పంకజ్’ అని చూడవొచ్చు.
తన ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తే, తను 2019 లో జే.ఎన్.యూ లో చేరినట్టు తెలుస్తుంది. పోస్ట్ లో చెప్పినట్టు 1989 నుండి జే.ఎన్.యూ లో తను రీసెర్చ్ చేస్తుంటే, తన పేరు 2016-17 లో జే.ఎన్.యూ వారు తమ వెబ్ సైట్ లో పెట్టిన ఎం.ఫిల్. మరియు పీ.హెచ్.డీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ లిస్టు లో ‘Center of Social Medicine and Community Health – CSMCH’ సెక్షన్ లో ఉండాలి, కానీ లేదు.
అంతేకాదు, మిగితా ఫాక్ట్-చెకెర్స్ లో మాట్లాడుతూ తన వయస్సు 30 సంవత్సరాలు అని, ఈ సంవత్సరమే తను జే.ఎన్.యూ లోని ఎం.ఫిల్. ప్రోగ్రాం లో జాయిన్ అయినట్టు తెలిపాడు. FACTLY కూడా పంకజ్ తో మాట్లాడడానికి ప్రయత్నిచింది, తన నుండి జవాబు వచ్చాక ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.
చివరగా, ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ‘మొయినుద్దీన్’ కాదు, తన పేరు ‘పంకజ్’. తను ఈ సంవత్సరమే జే.ఎన్.యూ లో చేరాడు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
2 Comments
Pingback: ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ‘మొయినుద్దీన్’ కాదు, తన పేరు ‘పంకజ్’. తను ఈ సంవత్సరమే జే.ఎన్.యూ లో చేరాడ
Sorry i dont know