Fake News, Telugu
 

ఈ వీడియోలో పోలీసులు బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ని నిజంగా ప్రశ్నించట్లేదు, ఇది ఎడిట్ చేసిన వీడియో

0

‘బ్రిటన్ (UK) ప్రధాన మంత్రి బొరిస్ జాన్సన్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు. అబద్ధాలాడారని,….. ప్రధాన మంత్రి పదవికి అనర్హులని ప్రకటన’  అని ఒక వీడియో ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఎంతో  తెలుసుకొందాం.

క్లెయిమ్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ని పోలీసులు ప్రశ్నిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఒక సెటైర్, ‘లెడ్ బై డొంకీస్‘ అనే బ్రిటిష్ పొలిటికల్ కాంపెయిన్ గ్రూప్ వాళ్ళు ‘లైన్ అఫ్ డ్యూటీ ‘ అనే టీవీ సిరీస్ లోని ఒక క్లిప్‌ని వాడి ఇలా ఎడిట్ చేసారు. ఈ వీడియోలో పొస్ట్‌లో చెప్తున్నట్లుగా బోరిస్ జాన్సన్‌ని పోలీసులు నిజంగా ప్రశ్నించట్లేదు కాబట్టి ఈ పోస్టు తప్పుదోవ పట్టిస్తుంది.

పొస్ట్‌లో ఉన్న వీడియో మొదట్లో ఏసి -12 ఇంటర్వ్యూ అఫ్ బోరిస్ జాన్సన్ అని పోలీస్ అంటారు, దాన్ని ఆధారంగా కొన్ని కీవర్డ్స్  తో ఇంటర్నెట్‌లో సెర్చ్ చెయ్యగా ఒక వీడియో దొరికింది. ‘Boris Johnson questioned by Line of Duty team in Led by Donkeys video’ – అనేది వీడియో యొక్క టైటిల్. గార్డియన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారు దీన్ని అప్లోడ్ చేసారు. ఈ వీడియో వివరణలో ఇది స్పూఫ్ వీడియో అని స్పష్టంగా తెలిపారు.

లభించిన వీడియో  ఆధారంగా ఇంటర్నెట్ లో మరింత వెతకగా, లెడ్  బై డొంకిస్ వారి యూట్యూబ్ ఛానల్లో వారు అప్లోడ్ చేసిన వీడియో లభించింది. లెడ్  బై డొంకిస్ అనేది ఒక పొలిటికల్ కాంపెయిన్ గ్రూప్, బ్రిటన్ లోని నలుగురు స్నేహితులు దీన్ని స్థాపించారు. బ్రెక్సిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు దీన్ని స్థాపించారు. ఆ వీడియో యొక్క టైటిల్-  It’s not just the parties. He lies about everything.

ఒరిజినల్ పొస్ట్‌లోని వీడియో ఈ 6:22 నిడివిగల వీడియోలోని చిన్న భాగం. ఈ వీడియోలోని చిన్న క్లిప్‌ని లెడ్  బై డొంకిస్ వారు వారి ట్విట్టర్‌లో కుడా పోస్ట్ చేసారు. వీరి యూట్యూబ్ ఛానల్‌లో మరింత పరిశీలించగా, వీరు ఇటువంటి వీడియోలు మరిన్ని అప్లోడ్ చేసినట్లు తెలుస్తుంది. ఒక వీడియో టైటిల్‌ని బట్టి వీడియోలో లైన్ అఫ్ డ్యూటీ అనే బ్రిటిష్ టీవీ షోలోని క్లిప్స్, బోరిస్ జాన్సన్ యొక్క వేరే క్లిప్స్‌ని వాడి ఈ వీడియోని ఎడిట్ చేసినట్లు అర్ధం అయింది.

చివరగా, ఈ వీడియోలో పోలీసులు బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ని నిజంగా ప్రశించట్లేదు, ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో.

Share.

About Author

Comments are closed.

scroll