Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

తాటికల్లులో కొరోనా వైరస్ ను నివారించే గుణాలు ఉన్నాయని ఎయిమ్స్ బృందం తెలపలేదు

0

‘తాటికల్లులో కొరోనా వైరస్ ను నివారించే లక్షణాలు ఉన్నాయంటూ ఎయిమ్స్ వైద్యబృందం గుర్తించింది’ అని చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు . ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాటికల్లులో కొరోనా వైరస్ ను నివారించే గుణాలు ఉన్నాయని ఎయిమ్స్ బృందం తెలిపింది.

ఫాక్ట్ (నిజం): తాటికల్లులో కొరోనా వైరస్ ను నివారించే లక్షణాలు ఉన్నాయంటూ ఎయిమ్స్ బృందం తెలిపినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. భారత ప్రభుత్వం మరియు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) కూడా ఎక్కడా దాని గురించి చెప్పలేదు. ప్రస్తుతం, కొరోనా వైరస్ ను నివారించడానికి ఎటువంటి మందులు లేదా తెరపీలు లేవని WHO వారి వెబ్సైటులో చదవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

తాటికల్లులో కొరోనా వైరస్ ను నివారించే లక్షణాలు ఉన్నాయంటూ ఎయిమ్స్ ఎక్కడా అయినా చెప్పిందా అని వెతకగా, పోస్టులోని విషయాలను ఎయిమ్స్ బృందం తెలిపినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. కొరోనా వైరస్ కి సంబంధించి ఎయిమ్స్ వారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లో కూడా తాటికల్లు గురించి లేదు. భారత ప్రభుత్వం మరియు WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) కూడా ఎక్కడా తాటికల్లులో కొరోనా వైరస్ ను నివారించే లక్షణాలు ఉన్నాయని చెప్పలేదు.

ఇంతక ముందు, కొన్ని వ్యాధికారక సూక్ష్మజీవులను అంతం చేసే లక్షణాలు తాటికల్లులో ఉన్నాయని వార్తాపత్రికల్లో మరియు రీసెర్చ్ పేపర్లలో ఆర్టికల్స్ వచ్చినట్టు చూడవొచ్చు. కానీ, కొరోనా వైరస్ ను నివారించే లక్షణాలు తాటికల్లులో ఉన్నాయని ఎయిమ్స్ బృందం చెప్పినట్టు ఏ ఒక్క ప్రముఖ వార్తాసంస్థ కూడా ప్రచురించలేదు.

ప్రస్తుతం, కొరోనా వైరస్ ను నివారించడానికి ఎటువంటి మందులు లేదా తెరపీలు లేవని WHO వారి వెబ్సైటులో చదవొచ్చు.

చివరగా, తాటికల్లులో కొరోనా వైరస్ ను నివారించే గుణాలు ఉన్నాయని ఎయిమ్స్ బృందం తెలపలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll