Fake News, Telugu
 

ఓపియం పక్షుల ఉనికికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, వైరల్ వీడియో ఒక మీమ్ మాత్రమే

0

ఓపియం పక్షి గురించి తెలుసా మీకు? దీని దగ్గరికి వెళ్లి దీన్ని చూస్తే మీరు హిప్నొటైజ్ అయిపోతారు, తర్వాత అది మిమ్మల్ని తినేస్తుంది, మంచు ప్రదేశాల్లో ఉండే ఈ పక్షి కనుక మీకు ఎప్పుడైనా కనిపిస్తే దాని దగ్గరికి వెళ్లొద్దు“, అని హెచ్చరిస్తూ, ఓపియం పక్షుల యొక్క దృశ్యాలు అని చెప్తూ ఒక తెల్లటి పక్షిని చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: వైరల్ వీడియోలో ఉన్న పక్షి, మనుషుల్ని హిప్నొటైజ్ చేసే ‘ఓపియం బర్డ్’ 

ఫ్యాక్ట్ (నిజం): అసలు ఇలాంటి పక్షి ఉన్నట్లు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది ఒక సోషల్ మీడియా మీమ్. దీన్ని @dre.vfx అనే కంటెంట్ క్రియేటర్ మొదటగా తయారు చేశారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ఈ విషయాన్ని వెరిఫై చెయ్యడానికి ముందుగా తగిన కీ వర్డ్స్ ఉపయోగించి  ఇంటర్నెట్‌లో వెతకగా, ‘ఓపియం బర్డ్’ అనే పక్షి ఉనికిని ఋజువు చేస్తూ మాకు ఎటువంటి మీడియా కథనాలు, శాస్త్రీయ పరిశోధనల వీడియోలు, డాక్యుమెంటరీలు లేదా రీసెర్చ్ పేపర్లు కానీ దొరకలేదు. 

ఈ పక్షి గురించి ఇంటర్నెట్‌లో వెతుకుతుండగా, వైరల్ వీడియోలో ఓపియం పక్షికి చెందినవి అని చెప్పి చూపిస్తున్న వీడియో క్లిప్స్ మాకు  @dre.vfx అనే సోషల్ మీడియా యూసర్ యొక్క ఇంస్టాగ్రామ్ పేజీ మరియు యూట్యూబ్ చానల్‌లో ఈ ‘ఓపియం బర్డ్’కి చెందిన వీడియోస్ ఉన్నాయి. 

అయితే, @dre.vfx ఇంస్టాగ్రామ్ బయోలో ‘ Creator of the Opium Birds’ అని రాసి ఉంది. తన పేజీలో ఉన్న ఒక స్టోరీ హైలైట్‌స్‌లో ఈ ‘ఓపియం బర్డ్’ని @dre.vfx ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసాడని, ఇది టిక్ టాక్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో పెద్ద మీమ్  అని చెప్తున్న వీడియో ఒకటి ఉంది. దీనిబట్టి ఒక మీమ్ వీడియోని నిజంగానే ఈ భూమిపైన మంచు ప్రదేశాల్లో జీవించే, మనుషుల్ని హిప్నొటైజ్ చేసే ఒక పక్షికి చెందిన వీడియో అని చెప్పి తప్పుడు కథనాన్ని షేర్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. 

చివరగా, ఓపియం పక్షి అనేది ఈ భూమిపైన నివసించే ఒక నిజమైన పక్షి కాదు. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడింది. 

Share.

About Author

Comments are closed.

scroll