అయోధ్యలో నిర్మిస్తున్న కొత్త రైల్వే స్టేషన్ యొక్క దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్యలో నిర్మిస్తున్న కొత్త రైల్వే స్టేషన్ యొక్క దృశ్యం.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్నది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి (రీ-డెవలప్మెంట్) ప్రాజెక్టు యొక్క బ్లూప్రింట్ చిత్రం. రైల్వే మంత్రుత్వ శాఖ స్టేషన్ రీ-డెవలప్మెంట్ స్కీంలో భాగంగా న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం ఈ బ్లూప్రింట్ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది అయోధ్య రైల్వే స్టేషన్ కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Swarajyamag’ న్యూస్ వెబ్సైటు 14 ఫిబ్రవరి 2020 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ రీ-డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క బ్లూప్రింట్ చిత్రమని ఆర్టికల్‌లో తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ, స్టేషన్ రీ-డెవలప్మెంట్ స్కీంలో భాగంగా న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం ఈ బ్లూప్రింట్ చిత్రాన్ని రూపొందించినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ 2020లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
స్టేషన్ రీ-డెవలప్మెంట్ స్కీంలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ మరియు బిజ్వాసన్ రైల్వే స్టేషన్లని ప్రపంచ స్థాయిలో ఆధునీకరణ చేయాలనీ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించుకున్నట్టు ‘Financial Express’ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్ట్ కోసం రైల్వే మంత్రుత్వ శాఖ 6,500 కోట్లు వెచ్చించనున్నట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ప్రాజెక్టుని ‘Rail Land Development Authority’ (RLDA) నిర్మించనుంది. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ మొదటి దశ పనులు 2022లో మొదలుపెట్టనున్నట్టు ఇటీవల పలు న్యూస్ సంస్థలు రిపోర్ట్ చేసాయి.
2020లో అయోధ్య రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం 104.77 కోట్ల రూపాయిల నిధులని కేటాయించింది. అయోధ్య రైల్వే స్టేషన్ ప్లానింగ్ చిత్రాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అయోధ్య రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు మార్చ్ 2022 వరకు పూర్తి అవుతాయని ఇటీవల ఉత్తర రైల్వే సినియర్ అధికారి మీడియాకి తెలిపారు.
ఇదివరకు, గుజరాత్ గాంధీనగర్ రైల్వే స్టేషన్ దృశ్యాలని అయోధ్య రైల్వే స్టేషన్ దృశ్యాలంటూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
చివరగా, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ రీ-డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బ్లూప్రింట్ ఫోటోని అయోధ్య రైల్వే స్టేషన్ దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.