Fake News, Telugu
 

రాజ్యసభ ఎం.పీ. లకు ప్రభుత్వం ఇళ్ళను కేటాయిస్తుంది, అంతే కానీ వాళ్ళ ప్రైవేటు ఇళ్ళకు అద్దెలను కట్టదు

0

2014 నుండి ఫోటోలో ఉన్న ఇంట్లో మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం రెండు లక్షల అద్దెకు ఉంటూ, ఆ అద్దెను కేంద్ర ప్రభుత్వం తో కట్టిస్తున్నాడని, అయితే ఆ ఇల్లు తన భార్య మరియు తన కొడుకు పేరు మీద ఉందని ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తన కొడుకు మరియు భార్య పేరు మీద ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న మాజీ ఆర్థికమంత్రి చిదంబరం. ఆ అద్దెను కేంద్ర ప్రభుత్వం కడుతూ వస్తుంది.

ఫాక్ట్ (నిజం): రాజ్యసభ ఎం.పీ లకు కేంద్ర ప్రభుత్వం ఇళ్ళను కేటాయిస్తుంది. అంతే కానీ, పోస్ట్ లో చెప్పినట్టు ప్రైవేటు ఇళ్ళల్లో ఎం.పీ. లు ఉంటే వాటికి అద్దెలు కట్టదు. కేటాయించిన ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో ఉంటే ఎవరి అద్దెలు వారే కట్టుకుంటారు. ఫోటోలోని ఇల్లు కార్తీ మరియు నళిని చిదంబరం పేరు మీద ఢిల్లీ లో ఉన్న జోర్ బాగ్ ఇల్లు. ఒకవేళ, ఆ ఇంటికి చిదంబరం అద్దె చేల్లిస్తున్నా, అది తన సొంత డబ్బు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అది కార్తీ మరియు నళిని చిదంబరం పేరు మీద ఢిల్లీ లో ఉన్న జోర్ బాగ్ ఇల్లు అని తెలుస్తుంది. పోస్ట్ లో ఉన్న ఫోటోని ఒకరు ట్వీట్ చేసి, చిదంబరంని అరెస్ట్ చేస్తుండగా, ఇంట్లో నుండి చూస్తున్న సింఘ్వి అని రాసారు.  ఆ ఇంటి పూర్తి ఫోటో ‘News18’  ఆర్టికల్ లో చూడవచ్చు.

తన భార్య మరియు కొడుకు పేరు మీద ఉన్న ఇంటికి 2014 నుండి చిదంబరం రెండు లక్షల అద్దె కడుతునట్టు ‘PGurus’ వెబ్ సైట్ లో చదవచ్చు. ‘PGurus’ వెబ్ సైట్ లో చిదంబరం అద్దె కడుతున్నట్టు ఉంటుంది, పోస్ట్ లో చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం కడుతుందని ఉండదు.

రాజ్యసభ ఎం.పీ లకు కేంద్ర ప్రభుత్వం ఇళ్ళను కేటాయిస్తుంది. అంతే కానీ, పోస్ట్ లో చెప్పినట్టు ప్రైవేటు ఇళ్ళల్లో ఎం.పీ. లు ఉంటే వాటికి అద్దెలు కట్టదు. 2016 లో రాజ్యసభ కి చిదంబరం ఎన్నికయ్యాడు. తనకు కేటాయించిన ఇంటి అడ్రస్ ను రాజ్యసభ వెబ్ సైట్ లో చూడవచ్చు. కావున, ఫోటోలోని ఇంటికి కేంద్ర ప్రభుత్వం అద్దె చెల్లించదు.

రాజ్యసభ ఎం.పీ. లు ఇంటి కోసం అప్లై చేసే ఫారం ఇక్కడ చూడవచ్చు. ఎం.పీ. లకు హౌస్ కమిటీ ఇళ్ళను ఎలా కేటాయిస్తుందో ఇక్కడ చదవచ్చు. 

చివరగా, రాజ్యసభ ఎం.పీ. లకు ప్రభుత్వం ఇళ్ళను కేటాయిస్తుంది, అంతే కానీ వాళ్ళ ప్రైవేటు ఇళ్ళకు అద్దెలను కట్టదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll