Fake News, Telugu
 

పోస్ట్ లోని ట్వీట్ ని పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ చేయలేదు. అది ఒక ఫేక్ అకౌంట్

0

‘చాలా మంది పాకిస్తానీయులు విదేశాలలో మేము భారతీయులం అని చెప్పుకొని జీవిస్తున్నారు….’ అంటూ మహీరా ఖాన్ అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ ట్వీట్ చేసిందని చెప్తూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘యుద్ధం జరిగి పాకిస్తాన్ ఓడిపోతే, అప్పుడైనా పాకిస్తానీయులకు భారత్ పౌరసత్వం మరియు గౌరవం వస్తాయి’ అని మహీరా ఖాన్ (పాకిస్తాన్ జర్నలిస్ట్) ట్వీట్ చేసింది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ట్వీట్ ని మహీర ఖాన్ ట్వీట్ చేయలేదు. ‘@maahirakhann’ పేరుతో పోస్ట్ లో ఉన్నది ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్. అంతే కాదు, తను పాకిస్తాన్ కు చెందిన సినిమా నటి, జర్నలిస్ట్ కాదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లో ఉన్న ట్విట్టర్ అకౌంట్ (@maahirakhann) కోసం ట్విట్టర్ లో వెతకగా, ఆ అకౌంట్ ఇప్పుడు సస్పెండ్ అయినట్టుగా చూడవచ్చు.

పోస్ట్ లోని ట్వీట్ లో ప్రొఫైల్ పిక్చర్ ఉంది. ఆ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటోలో ఉన్నది పాకిస్తాన్ కి చెందిన సినీ నటి మహీరా ఖాన్ అని తెలుస్తుంది. పోస్ట్ లో చెప్పినట్టు తను జర్నలిస్ట్ కాదు.

మహిరా ఖాన్ కు ట్విట్టర్ అకౌంట్ ఉంది. కానీ, తన ట్విట్టర్ అకౌంట్ పేరు  ‘Mahira Khan’ (@TheMahiraKhan), పోస్ట్ లో చెప్పినట్టు ‘Mahira’ (@maahirakhann) కాదు.

పోస్ట్ లోని ట్వీట్ తను ఏమైనా చేసిందా అని వెతకగా, తను అలాంటి ట్వీట్ చేయలేదని తెలుస్తుంది. అంతేకాదు, తను కాశ్మీర్ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మద్దత్తు ఇస్తూ ట్వీట్ చేసిందని తన ట్విట్టర్ అకౌంట్ లో చూడవచ్చు.

చివరగా, పోస్ట్ లోని ట్వీట్ ని పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ చేయలేదు. అది ఒక ఫేక్ అకౌంట్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll