Fake News, Telugu
 

టీడీపీ-జనసేన చీటింగ్ టీమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీమ్ అని చంద్రబాబు అన్నట్లుగా ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో టీడీపీ-జనసేన చీటింగ్ టీమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీమ్ అని చంద్రబాబు నాయుడు అన్నట్లుగా చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక బహిరంగ సభలో టీడీపీ-జనసేన చీటింగ్ టీమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీమ్ అని చంద్రబాబు నాయుడు అన్నాడు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 28 ఫిబ్రవరి 2024న తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల మొదటి ఎన్నికల బహిరంగ సభకు సంబంధించిన వీడియోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను  రూపొందించారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగిస్తూ “టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీమ్” అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకి సంబంధించిన  మరింత సమాచారం కోసం పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని TV5 NEWS తమ యూట్యూబ్ ఛానల్ లో 28 ఫిబ్రవరి 2024 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణలో, ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల మొదటి ఎన్నికల బహిరంగ సభకు సంబంధించింది అని తెలిసింది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, టైంస్టాంప్ 27.07 వద్ద వైరల్ క్లిప్ మొదలు అవుతుంది అని తెలిసింది. వాస్తవంగా చంద్రబాబుసభలో ప్రసంగిస్తూ “టీడీపీ-జనసేన  పొత్తు సూపర్  హిట్, నీ(వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) కుట్రలు కుంత్రాలు అట్టర్ ఫ్లాప్ , విధ్వంసానికి  ఇంకా ఫుల్ స్టాప్ , అందుకే టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీమ్” అని అన్నారు. దీన్ని బట్టి ఈ వీడియోను ఎడిట్ చేసి వైరల్ వీడియో రూపొందించారు అని నిర్ధారించవచ్చు. ఇదే సభకు చెందిన మరో వీడియో వైరల్ అవగా దాని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, టీడీపీ-జనసేన చీటింగ్ టీమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీమ్ అని చంద్రబాబు అన్నట్లుగా ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll