Fake News, Telugu
 

జనసేన జెండాలు తీసి మడిచి పెట్టుకోమని చంద్రబాబు అన్నట్లు ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో జనసేన జెండాలు తీసి మడిచి పెట్టుకోమని జనసేన కార్యకర్తలను ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు అన్నట్లుగా చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక బహిరంగ సభలో జనసేన జెండాలు తీసి మడిచి పెట్టుకోమని జనసేన కార్యకర్తలను ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు అన్నాడు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 28 ఫిబ్రవరి 2024న తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల మొదటి ఎన్నికల బహిరంగ సభకు సంబంధించిన వీడియోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను  రూపొందించారు. లైవ్ టెలికాస్ట్ కు అంతరాయం కలగకుండా తన ముందున్న జెండాలను దించాలని చంద్రబాబు అన్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు “నాకు ఎదురగా ఉండే అందరు మీ జెండాలు దించాలి, తెలుగుదేశం జనసేన జెండాలు దించి, మీటింగ్ అవగానే మరల ఎగురవేద్దం, కొంచెం దించండి లేదా మడిచి పెట్టుకోండి, బ్యానర్ కూడా” అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకి సంబంధించిన  మరింత సమాచారం కోసం పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని TV5 NEWS తమ యూట్యూబ్ ఛానల్ లో 28 ఫిబ్రవరి 2024 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణలో, ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం, జనసేన పార్టీల మొదటి ఎన్నికల బహిరంగ సభకు సంబంధించింది అని తెలిసింది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, టైంస్టాంప్ 02.02 వద్ద వైరల్ క్లిప్ మొదలు అవుతుంది అని తెలిసింది. చంద్రబాబు తాను మాట్లాడేది బయట కూడా చూపించాలి (లైవ్ టెలికాస్ట్) కాబట్టి లైవ్ టెలికాస్ట్ కు అంతరాయం కలగకుండా తన ముందున్న జెండాలను దించాలని అన్నారు .వాస్తవంగా చంద్రబాబు “నాకు ఎదురగా ఉండే అందరు మీ జెండాలు దించాలి, తెలుగుదేశం జనసేన జెండాలు దించి, మీటింగ్ అవగానే మరల ఎగురవేద్దం, కొంచెం దించండి లేదా మడిచి పెట్టుకోండి,బ్యానర్ కూడా” అని అన్నారు. దీన్ని బట్టి ఈ వీడియోను ఎడిట్ చేసి వైరల్ వీడియో రూపొందించారు అని నిర్ధారించవచ్చు.

చివరగా, జనసేన జెండాలు తీసి మడిచి పెట్టుకోమని చంద్రబాబు అన్నట్లు ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll