Fake News, Telugu
 

భారతదేశ జాతీయ గీతం ‘జన గణ మన’ని యునెస్కో ప్రపంచపు అత్యుత్తమ గీతంగా ప్రకటించలేదు

0

భారత దేశ జాతీయ గీతం ‘జన గణ మన’ను యునెస్కో ప్రపంచంలోనే అత్యుత్తమ గీతంగా కొద్ది నిమిషాల క్రితం ప్రకటించిందని చెప్తూ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది . ఈ క్లెయిమ్ యొక్క నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

క్లెయిమ్: భారతదేశ జాతీయ గీతం ‘జన గణ మన’ను యునెస్కో ప్రపంచంలోనే అత్యుత్తమ గీతంగా ప్రకటించింది.

ఫ్యాక్ట్(నిజం): ‘జన గణ మన’ను యునెస్కో ప్రపంచంలోనే అత్యుత్తమ గీతంగా ప్రకటించలేదు.  యునెస్కో వారు స్వయంగా ఈ క్లెయిమ్ అబద్ధం అని స్పష్టం చేశారు.. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు. 

అసలు యునెస్కో ‘జన గణ మన’ని ప్రపంచంలోనే అత్యుత్తమ మైన గీతంగా ప్రకటించిందా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే, దీనికి రుజువుగా మాకు ఎలాంటి వార్తా కథనాలు లభించలేదు. యునెస్కో అధికారిక వెబ్‌సైట్‌లో కూడా, మన జాతీయ గేయానికి ఇలాంటి బిరుదు వచ్చింది అని చెప్తూ ఎటువంటి ప్రకటన లేదు. 

రుజువుల కోసం సెర్చ్ చేస్తున్న సమయంలో, ఈ విషయానికి సంబంధించిన, 2008 నాటి ఇండియా టుడే వారి ఒక ఆర్టికల్ లభించింది. ఈ వార్త ఫేక్ అని, భారత జాతీయ గీతాన్ని యునెస్కో “ప్రపంచపు అత్యుత్తమ గీతం”గా ప్రకటించలేదు అని ఇండియా టుడేకి యునెస్కో యొక్క అధికారి సూ విలియమ్స్  పేర్కొన్నారు. 

దీనిబట్టి ఇది ఒక పాత ఫేక్ వార్త అని మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పుడు, అది నిజం కాదు అనే విషయాన్ని చెబుతూ ఫాక్ట్-చెకింగ్ సంస్థ స్నోప్స్ వారు ఒక కథనాన్ని ప్రచురించారు. ఈ విషయంపై యునెస్కో వారికి మేము ఒక ఈ-మెయిల్ చేయడం జరిగింది, వారు స్పందించిన తర్వాత, ఈ కథనాన్ని మేము అప్డేట్ చేస్తాము. దీని గురుంచి గతంలో ఫ్యాక్ట్లీ ఇంగ్లీషులో రాసిన ఫాక్ట్-చెక్ ఇక్కడ చదవచ్చు.

చివరిగా, ‘జన గణ మన’ని ప్రపంచంలోనే అత్యుత్తమ గేయంగా యునెస్కో ప్రకటించలేదు

Share.

About Author

Comments are closed.

scroll