కమ్యూనిస్టుగా ఇదివరకు జీవితాన్ని గడిపి, యువతలో మావోయిజం భావాజాలలను ప్రేరేపించిన కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్, ప్రస్తుతం దేవాలయాలకు వెళ్ళి ప్రార్ధనలు చేస్తూ వృద్ధాప్యాన్ని గడుపుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. నూదిటిపై తిలకం పెట్టుకున్నట్టుగా ఉన్న అచ్యుతానందన్ ఫోటోని ఈ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కమ్యూనిస్టు నేతగా ఇదివరకు జీవితాన్ని గడిపిన వి. ఎస్. అచ్యుతానందన్, ప్రస్తుతం నుదుటిపై తిలకం పెట్టుకొని దేవాలయాలను సందర్శిస్తున్నారు, దానికి సంబంధించిన ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలో వి.ఎస్.అచ్యుతానందన్ నూదిటిపై తిలకం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘Asianet News’ వార్తా సంస్థ 2021 జనవరి నెలలో పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో దొరికింది. వి.ఎస్. అచ్యుతానందన్ 98వ పుట్టినరోజు సందర్భంగా ‘Asianet News’ వార్తా సంస్థ ఈ ఫోటోని షేర్ చేస్తూ 20 అక్టోబర్ 2021 నాడు ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన అసలైన ఫోటోలో అచ్యుతానందన్ నూదిటిపై తిలకం లేదు.
ఈ అసలైన ఫోటోని షేర్ చేస్తూ గతంలో పబ్లిష్ చేసిన మరికొన్ని వార్తా రిపోర్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. వి.ఎస్. అచ్యుతానందన్ 97వ పుట్టినరోజు సందర్భంగా ఇదే ఫోటోతో పోలి ఉన్న మరో ఫోటోని అచ్యుతానందన్ కొడుకు అరుణ్ కుమార్ షేర్ చేశారు.
అచ్యుతానందన్ నూదిటిపై తిలకం పెట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినదని పలు వార్తా సంస్థలు స్పష్టం చేశాయి. ఆ వార్తా రిపోర్టులను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, కేరళ కమ్యూనిస్ట్ నేత అచ్యుతానందన్ నుదుటిపై తిలకం పెట్టుకున్నట్టుగా షేర్ చేస్తున్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడినది.