Fake News, Telugu
 

రహదారి మీదుగా వెళ్తున్న కారుపై దుండగులు దాడి చేస్తున్న ఈ ఘటన ఒడిశాలో జరిగింది

0

తమిళనాడు లో జాతీయ రహదారులపై వెళ్తున్న కార్ల పై దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తమిళనాడు జాతీయ రహదారి పై వెళుతున్న కారు పై దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియో లో కనిపిస్తున్న ఘటన ఒడిశా రాష్టంలోని  జజ్పూర్ నగర సమీపంలో జరిగింది, తమిళనాడు రహదారి పై కాదు. ‘18 డిసెంబర్ 2020’ నాడు జాజ్పూర్ లోని కళింగ నగర్ లో  కొంత మంది ప్రయాణం చేస్తున్న ఒక  కారుపై దుండగులు దాడి చేయడానికి ప్రయత్నించినట్టు జాజ్పూర్ పోలీసులు తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలని కలిగిన వీడియోని ఒకరు ‘24 డిసెంబర్ 2020’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఒడిశా రాష్ట్రంలోని జజ్పూర్ లో రహదారి పై వెళ్తున్న కార్ పై కొందరు దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ ‘CarToq’, ఈ వీడియోని తమ వెబ్సైటులో షేర్ చేసింది.

ఈ వివరాల ఆధారంగా ఆ వీడియో కి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ‘Sambad English’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో ఈ ఘటన ‘18 డిసెంబర్ 2020’ నాడు జాజ్పూర్ లోని కళింగ నగర్ సమీపంలో జరిగినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కొరకు జాజ్పూర్ లోని కళింగ నగర్ పోలీస్ స్టేషన్ ని సంప్రదించగా, ఈ ఘటన జాజ్పూర్ లోనే జరిగిందని కళింగ నగర్ పోలీసులు స్పష్టం చేసారు.

ఈ ఘటనకు సంబంధించి ఒడిశా లోకల్ న్యూస్ వెబ్ సైట్స్ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ని మరియు వీడియో రిపోర్ట్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ  చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో తమిళనాడుకు సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రహదారి మీదుగా వెళ్తున్న కారుపై దుండగులు దాడి చేస్తున్న ఈ ఘటన  ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది, తమిళనాడు లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll