ఒక వ్యక్తి చిన్నపిల్లల్ని కొడుతున్న వీడియోని షేర్ చేస్తూ ఈ వీడియోలో పిల్లల్ని కొడుతున్నది రాజ్‌బాగ్‌లోని DPS స్కూల్ టీచర్ షకీల్ అహ్మద్ అన్సారీ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమెంటో చూద్దాం.

క్లెయిమ్: రాజ్‌బాగ్‌లోని DPS స్కూల్ టీచర్ షకీల్ అహ్మద్ అన్సారీ చిన్న పిల్లల్ని కొడుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2014లో ఈజిప్ట్‌లోని ఒక అనాథాశ్రమంలో, మేనేజర్ ఒసామా మొహమ్మద్ ఒత్మాన్ ఆశ్రమం పిల్లల్ని కొట్టిన ఘటనది. అప్పుడు ఈ వీడియోని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి రాజ్‌బాగ్‌లోని DPS స్కూల్‌కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియో 2014లో ఈజిప్ట్‌లోని ఒక అనాథాశ్రమంలో జరిగిన ఘటనకి సంబంధించింది. ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని రిపోర్ట్ చేసిన కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం వీడియోలో పిల్లల్ని కొడుతున్నది గిజా, ఈజిప్ట్‌లోని దార్ మక్కా అల్- మొకారామా అనాథ శరణాలయం మేనేజర్ ఒసామా మొహమ్మద్ ఒత్మాన్.

ఈ వీడియో వెలుగులోకి రావడంతో సంబంధిత మంత్రి ఆదేశాలతో ఆ పిల్లల్ని వేరే అనాథ శరణాలయానికి తరలించి, అనాథ శరణాలయం మేనేజర్‌ని అరెస్ట్ చేసినట్టు BBC రిపోర్ట్ చేసింది. కోర్టు విచారణ తరవాత అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టు ఈ వార్తా కథనం రిపోర్ట్ చేసింది. ఈ సమాచారం ఆధారంగా ఈ ఘటన రాజ్‌బాగ్‌లోని DPS స్కూల్‌లో జరగలేదని స్పష్టమవుతుంది.

చివరగా, 2014లో ఈజిప్ట్‌లోని అనాథాశ్రమం మేనేజర్ చిన్న పిల్లల్ని కొట్టిన వీడియోని, రాజ్‌బాగ్‌లోని DPS స్కూల్‌లో జరిగిన ఘటనంటూ షేర్ చేస్తున్నారు.