అందుబాటులో నాలుగు కిడ్నీలు ఉన్నాయంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. దానం చేసేవారి బంధువులను సంప్రదించడానికి ఈ మూడు ఫోన్ నంబర్లను వాడొచ్చని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
![](https://factly.in/wp-content/uploads//2022/01/Four-Kidneys-Available-Three-Phone-Numbers-Message_post.jpg)
క్లెయిమ్: నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
ఫాక్ట్: కనీసం అక్టోబర్ 2017 నుండి ఇటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. పోస్టులో ఉన్న రెండు ఫోన్ నంబర్లు పనిచేయడం లేదు; మరో నంబరుపై ఉన్న వ్యక్తి పోస్ట్ ఫేక్ అని స్పష్టం చేసాడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సెర్చ్ చేసినప్పుడు, కనీసం అక్టోబర్ 2017 నుండి ఇటువంటి పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కానీ, అప్పట్లో, ఇది ఒక ఫోన్ నంబర్‌తో మాత్రమే షేర్ అయ్యింది.
2018లో ‘చెక్4స్పామ్’ 983xxxxxxx నంబర్ ఉన్న వ్యక్తిని కాంటాక్ట్ అయినప్పుడు, పోస్ట్ ‘పూర్తిగా తప్పు’, ‘ఫేక్’ అని ఆ వ్యక్తి స్పష్టం చేశాడు. ఇదే పోస్టును 2018లో ‘ఎస్ఎం హోక్స్ స్లేయర్’ కూడా ఫాక్ట్-చెక్ చేసింది. ఫోన్ నెంబరు మీరట్ కు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గార్గ్ కు చెందినదని ‘ఎస్ఎం హోక్స్ స్లేయర్’ తెలిపింది.
![](https://factly.in/wp-content/uploads//2022/01/Four-Kidneys-Available-Three-Phone-Numbers-Message_image1.jpg)
పోస్టులో ఉన్న రెండు ఫోన్ నంబర్లు పనిచేయడం లేదు. అలాగే, వేరే ఫోన్ నంబర్‌తో (ఇది కూడా ఇప్పుడు పనిచేయడం లేదు) ఇటువంటి పోస్ట్ ఆగస్టు 2017లో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, కర్ణాటకలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి పోస్ట్ ఇప్పటికీ, 2020లో కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.
![](https://factly.in/wp-content/uploads//2022/01/Four-Kidneys-Available-Three-Phone-Numbers-Message_image2.jpg)
చివరగా, ‘నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు’ అని షేర్ అవుతున్న పోస్ట్ ఫేక్.