ప్రపంచంలోనే అత్యంత వింతైన మరణం అని చెప్తూ, నిశ్చలంగా ఒకే చోట నిలబడిపోయిన ఒక మనిషిని చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ఈ వీడియోలోని వ్యక్తి నిలబడి ఉండగా మరణించాడు, ఇది ప్రపంచంలోనే అత్యంత వింతైన మరణం.
ఫాక్ట్(నిజం): ఈ సంఘటన 2015లో కజకిస్థాన్‌లో చోటుచేసుకుంది. అల్మాటీ అనే ప్రదేశంలో ఉన్న ఒక షాపింగ్ మాల్ లోపల ఒక మనిషి శిలలాగా నుంచుండిపోయాడు. అతిగా మద్యం సేవించడం వల్ల తను ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళటం వల్ల ఇలా అయ్యాడు. తర్వాత తాను ఆసుపత్రిలో చికిత్స పొందాక కోలుకున్నాడు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.
వీడియో గుంరించి మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ వీడియోకి సంబంధించి 2015లో పబ్లిష్ అయ్యిన కొన్ని వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) లభించాయి.
Tengrinews అనే కజకిస్థాన్ వెబ్సైట్ ప్రకారం ఆ దేశంలోని Taldykorgan అనే నగరంలోని ఒక shopping mallలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో వ్యక్తి అతిగా మద్యం తాగటం మూలాన ఇలా ఒక అపస్మారక స్థితి (కోమా వంటి స్థితి)లోకి వెళ్ళాడు అని వార్తా కథనాలు వివరించాయి.
వార్తా నివేదికల ప్రకారం తాను ఇలా కొన్ని గంటలు నుంచున్నాడు. తనని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఇచ్చిన తర్వాత కోలుకున్నాడు, అంతే కానీ వైరల్ పోస్టులో చెప్తున్నట్లు తను మరణించలేదు. తను కోలుకున్నాడు అనే విషయాన్ని కజకిస్థాన్ (అల్మాటీ ఓబ్లాస్ట్) యొక్క డిపార్ట్మెంట్ అఫ్ హెల్త్ వాళ్ళు కూడా ధ్రువీకరించారు.
చివరిగా, ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మరణించలేదు, అతిగా మద్యం సేవించడం వళ్ళ అపస్మారక స్థితిలోకి వెళ్ళి, చికిత్స చేసాక కోలుకున్నాడు.