Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని దుర్గా మాతకి హారతి ఇవ్వడానికి నిరాకరిస్తున్న రాహుల్ గాంధీ అని షేర్ చేస్తున్నారు

0

దుర్గా మాతకి హారతి ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిరాకరిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: దుర్గా మాతకి హారతి ఇవ్వడానికి రాహుల్ గాంధీ నిరాకరిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. ఈ వీడియో రాహుల్ గాంధీ 2017లో రాజ్‌కోట్‌లోని గర్బా పండల్‌ని సందర్శించినప్పుడు తీసారు. గర్బా పండల్‌లో తాను దుర్గా మాతకి హారతి ఇస్తున్నప్పుడు తీసిన ఫోటోలని రాహుల్ గాంధీ తన ట్విటర్ హాండిల్‌లో షేర్ చేశారు. రాహుల్ గాంధీ దుర్గా మాతకి హారతి ఇస్తున్నప్పుడు తీసిన దృశ్యాలని క్లిప్ చేసి ఈ వీడియోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర పట్వారీ 27 సెప్టెంబర్ 2017 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. జితేంద్ర పట్వారీ షేర్ చేసిన ఈ వీడియోలోని మొదటి కొన్ని సెకండ్లలో రాహుల్ గాంధీ దుర్గా మాతకి హారతి పడుతున్న దృశ్యాలని స్పష్టంగా చూడవచ్చు. ఇదే వీడియోని ‘ఇండియా టుడే’ జర్నలిస్ట్ సుప్రియా భరద్వాజ్  కూడా 2017 సెప్టెంబర్ నెలలో తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్‌కోట్‌లోని గర్బా పండల్‌ని సందర్శించి పూజలు నిర్వహించిన దృశ్యాలని సుప్రియా భరద్వాజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

రాజ్‌కోట్ గర్బా పండల్‌లో రాహుల్ గాంధీ దుర్గా మాతకి హారతి పడుతున్నప్పుడు తీసిన ఫోటోలని పలు వార్తా సంస్థలు తమ ట్విటర్ హ్యాండిల్స్ షేర్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

అంతేకాదు, గర్బా పండల్‌లో దుర్గా మాతకి తాను హారతి పడుతున్నప్పుడు తీసిన ఫోటోలని రాహుల్ గాంధీ 27 సెప్టెంబర్ 2017 నాడు ట్వీట్ కూడా చేశారు. రాహుల్ గాంధీ దుర్గా మాతకి హారతి ఇస్తున్నప్పుడు తీసిన దృశ్యాలని క్లిప్ చేసి ఈ వీడియోని రూపొందించినట్టు పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని రాహుల్ గాంధీ దుర్గా మాతకి హారతి ఇవ్వడానికి నిరకరిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll