Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

కరోనా వైరస్ అత్యంత ప్రమాదంగా మారిందని, ఎవరినైనా మూడు రోజుల్లోనే చంపేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పలేదు

0

ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుగానే చెప్పినట్టు ఈ రోజున కరోనా అత్యంత డేంజర్ స్థితిలోకి చేరుకుంది. ఏ మాత్రం లక్షణాలు కనబడకుండానే, వయస్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ళ వారినైనా సరే మూడే మూడు రోజుల్లో చంపేస్తుంది’ అని చెప్తూ, ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుంది – ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఫాక్ట్: కరోనా వైరస్ ప్రస్తుతం చాలా ప్రమాదకంగా మారిందని, ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, భారత ప్రభుత్వం కానీ ఎక్కడా చెప్పలేదు. ఐసీఎంఆర్, బయోటెక్నాలజీ డిపార్టుమెంటు వారు తాజాగా భారతదేశంలో నిర్వహించిన రెండు అధ్యయనాల ప్రకారం వైరస్ జెనెటిక్స్ స్థిరంగా ఉందని, వైరస్ లో పెద్ద మ్యుటేషన్ లేదని తెలిసిందని భారత ప్రధానమంత్రి వెబ్ సైట్ లో చదవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, కరోనా వైరస్ ప్రస్తుతం చాలా ప్రమాదకంగా మారిందని,  ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, భారత ప్రభుత్వం కానీ ఎక్కడా చెప్పలేదని తెలుస్తుంది. కోవిడ్-19 వచ్చిన వారిలో 80 శాతం మందికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమే రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్ సైట్ లో చదవొచ్చు.

తాజగా, భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లో కూడా కరోనా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ రెండు నుండి 14 రోజులు అని ఇచ్చినట్టు ఇక్కడ చూడవొచ్చు.

ఐసీఎంఆర్, బయోటెక్నాలజీ డిపార్టుమెంటు వారు తాజాగా భారతదేశంలో నిర్వహించిన రెండు అధ్యయనాల ప్రకారం వైరస్ జెనెటిక్స్ స్థిరంగా ఉందని మరియు వైరస్ లో పెద్ద మ్యుటేషన్ లేదని తెలిసిందని భారత ప్రధానమంత్రి వెబ్ సైట్ లో చదవొచ్చు.

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల కోవిడ్-19 డేటాతో నిర్వహించిన స్టడీలో కూడా మరణ శాతం కేవలం రెండు శాతం మాత్రమే ఉందని చూడవొచ్చు. అయితే, అమెరికాతో పోలుస్తే మాత్రం తక్కువ వయసు వారు ఎక్కువ శాతం చనిపోయినట్టు తెలిసింది. ఆ పూర్తి స్టడీ ని ఇక్కడ చదవొచ్చు. 

చివరగా, కరోనా వైరస్ ప్రస్తుతం చాలా ప్రమాదకంగా మారిందని, ఎవరినైనా మూడు రోజుల్లోనే లక్షణాలు కనబడకుండానే చంపేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, భారత ప్రభుత్వం కానీ ఎక్కడా చెప్పలేదు.

Share.

About Author

Comments are closed.

scroll