Fake News, Telugu
 

ముస్లిం ప్రార్థనల్లో ప్రధాని మోదీ పాల్గొన్న ఈ వీడియో 2018వ సంవత్సరంది, ఇప్పటిది కాదు

0

నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్ చౌహన్ ఇద్దరు ముస్లిం ప్రార్ధనలో పాల్గొన్న వీడియోని షేర్ చేస్తూ, వచ్చే నెలలో జరగబోయే బీహార్ ఎన్నికల నేపథ్యంలో మోదీ ఆడుతున్న డ్రామా అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2020 బీహార్ ఎన్నికల కోసం ముస్లిం ప్రార్థనలో పాల్గొన్న నరేంద్ర మోదీ.

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్నది 2018లో ఇండోర్ లో దావూది బోహ్రా వర్గం వారు ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం నిర్వహించిన ప్రార్ధన సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నప్పటి వీడియో. ఈ వీడియోకి, నవంబర్ 2020లో జరగబోయే బీహార్ ఎన్నికలకి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న వీడియో గురించిన మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోకి సంబంధించిన వార్తా కథనం ఒకటి మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో 2018లో ఇండోర్ లో దావూది బోహ్రా వర్గం వారు ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం నిర్వహించిన ప్రార్ధన సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నప్పటిది. దీన్నిబట్టి ఈ వీడియో పాతదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఈ ప్రార్ధనలో తను పాల్గొన్నప్పటి కొన్ని ఫోటోలను నరేంద్ర మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో కూడా షేర్ చేసారు. భారతీయ జనతా పార్టీ తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియో అప్లోడ్ చేసింది. ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, 2018లో ఇండోర్ లో మోదీ ముస్లిం ప్రార్థనల్లో పాల్గొన్న వీడియోని, 2020 బీహార్ ఎన్నికల కోసం పాల్గొన్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll