Fake News, Telugu
 

కేసీఆర్ ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసిన వీడియో షేర్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు

0

‘జరగబోయే నాగార్జున్ సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడగోట్టండి’ అని కేసీఆర్ అంటునట్టు ఉండే ఒక వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘జరగబోయే నాగార్జున్ సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడగోట్టండి’ అని కేసీఆర్ అన్న వీడియో.

ఫాక్ట్(నిజం): 10 ఫిబ్రవరి 2021న నల్గొండ జిల్లాలోని హాలియాలో జరిగిన మీటింగ్ లో కేసీఆర్ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించిన తరవాత ‘ఒకవేళ నేను చెప్పిన మాటల్లో ఒక్క మాట అబద్దం ఉన్నా , రేపు నాగార్జున సాగర్ లో జరగబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని ఓడగోట్టండి’ అని అన్నాడు. ఐతే కేసీఆర్ స్పీచ్ లో కేవలం ‘రేపు నాగార్జున సాగర్ లో జరగబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని ఓడగోట్టండి’ అన్న మాటని మాత్రమే డిజిటల్ గా కట్ చేసి, రిపీట్ చేసి ప్లే చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో ఉన్న వీడియోని పరిశీలిస్తే ఇది హాలియాలో జరిగన కేసీఆర్ సభకి సంబంధించిన TV9 వీడియో ఫుటేజ్ అని తెలుస్తుంది. దీని ఆధారంగా వెతకగా TV9 వారి అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ మీటింగ్ కి సంబంధించిన వీడియో షేర్ చేసిన పోస్టు ఒకటి మాకు కనిపించింది. ఈ వీడియోలో కేసీఆర్ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించిన తరవాత ‘ఒకవేళ నేను చెప్పిన మాటల్లో ఒక్క మాట అబద్దం ఉన్నా , రేపు నాగార్జున సాగర్ లో జరగబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని ఓడగోట్టండి’ అని అనడం గమనించొచ్చు.

ఐతే పైన తెలిపిన TV9 వీడియోలో కేసీఆర్ ‘రేపు నాగార్జున సాగర్ లో జరగబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని ఓడగోట్టండి’ అన్న మాటని మాత్రమే డిజిటల్ గా కట్ చేసి, రిపీట్ చేసి ప్లే చేసినట్టు అర్ధమవుతుంది. ఎందుకంటే పోస్టులో మరియు TV9 వీడియోలో కేసీఆర్ మాట్లాడుతునప్పుడు స్క్రీన్ పైన ఒకే స్క్రోలింగ్ ఉండడం చూడొచ్చు. పైగా హాలియా జరిగిన మీటింగ్ కి సంబంధించిన పూర్తి TV9 ఫుటేజ్ వీడియోని చుస్తే కూడా ఇదే విషయం అర్ధమవుతుంది.  

10 ఫిబ్రవరి 2021న నల్గొండ జిల్లాలోని హాలియాలో కేసీఆర్ మీటింగ్ జరిగిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

చివరగా, ప్రసంగంలోని కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసి షేర్ చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll