Fake News, Telugu
 

2015-19 మధ్యలో కేంద్ర ప్రభుత్వం 18,855 మంది విదేశీయులకు మాత్రమే భారతదేశ పౌరసత్వ గుర్తింపునిచ్చింది

0

2015-19 మధ్య కాలంలో 6.76 లక్షల మంది విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం భారతదేశ పౌరసత్వ గుర్తింపునిచ్చిందని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2015-19 మధ్యలో 6.76 లక్షల మంది విదేశీయులకు భారతదేశ పౌరసత్వ గుర్తింపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.

ఫాక్ట్: 2015-19 మధ్యలో కేవలం 18,855 మంది విదేశీయులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భారతదేశ పౌరసత్వ గుర్తింపునిచ్చింది. తాజాగా లోక్ సభ లో ఒక ప్రశ్నకు బదులిస్తూ 2015-19 మధ్యలో 6.76 లక్షల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, 2015-19 మధ్యలో 6.76 లక్షల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారని తెలుస్తుంది. ఈ సంఖ్య పౌరసత్వం వచ్చిన వాళ్ళది కాదు, పౌరసత్వం వదులుకున్న వాళ్ళది. తాజాగా 09 ఫిబ్రవరి 2021 న లోక్ సభ లో ఒక ప్రశ్నకు బదులిస్తూ 2015-19 మధ్యలో 6.76 లక్షల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. అంతేకాదు, 1,24,99,395 మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నట్టు వారు తెలిపారు.

అయితే, సెప్టెంబర్ 2020 లో మరో ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సమాధానమిస్తూ, 2015-19 మధ్యలో కేవలం 18,855 మంది విదేశీయులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భారతదేశ పౌరసత్వ గుర్తింపునిచ్చిందని లోక్ సభ లో తెలిపారు. అందులో 15,012 మంది బంగ్లాదేశ్ కి చెందినవరు ఉన్నారు (2015 లో ఇండియా-బంగ్లాదేశ్ ల్యాండ్ అగ్రిమెంట్ కింద 14,864 మంది బంగ్లాదేశ్ వారికి కేంద్ర ప్రభుత్వం భారతదేశ పౌరసత్వ గుర్తింపునిచ్చింది).

చివరగా, 2015-19 మధ్యలో కేంద్ర ప్రభుత్వం 18,855 మంది విదేశీయులకు మాత్రమే భారతదేశ పౌరసత్వ గుర్తింపునిచ్చింది.

Share.

About Author

Comments are closed.

scroll