Fake News, Telugu
 

వీడియో గేమ్స్, అండర్ వాటర్ పార్కులలోని శిల్పాలని ద్వారక నగరంలో కనుగొన్న శిల్పాలని షేర్ చేస్తున్నారు

0

సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరం యొక్క దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. నీటిలో దాగి ఉన్న అనేకమైన సముద్ర గర్భ శిల్పాల అవశేషాలని ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ద్వారకా నగరంలోని భూగర్భ శిల్పాల అవశేషాల యొక్క దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న చాలా వరకు సముద్ర గర్భ శిల్పాలు ద్వారకా నగరానికి సంబంధించినవి కావు. వీడియో గేమ్స్, అండర్ వాటర్ పార్కులలోని శిల్పాలు, శిలలని ద్వారక నగరంలో కనుగొన్న శిల్పాలుగా షేర్ చేస్తున్నారు. కావున, పోసులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ వీడియోలో కనిపిస్తున్న శిల్ప నిర్మాణాల దృశ్యాలని ఫోటోలుగా విడదీసి ఒక్కో శిల్ప కట్టడానికి సంబంధించిన వివరాలని తెలుసుకుందాం.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఈ దృశ్యం యొక్క చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Reflecting the Game’ అనే వీడియో గేమ్ సంస్థ ట్వీట్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఒక వీడియో గేములోని లోని చిత్రమని ఈ ట్వీట్లో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన ఇదే ఫోటో ‘Planet Minecraft’ గేమింగ్ వెబ్సైటులో కూడా దొరికింది. ‘The Atlantic Craft’ కొత్త యానిమేషన్ చిత్రం కోసం రూపొందించిన అండర్ వాటర్ అభయారణ్యం యొక్క ద్రుశ్యమని ఈ వెబ్సైటులో తెలిపారు. ‘The Atlantic Craft’ యూట్యూబ్ ఛానల్ పబ్లిష్ చేసిన “Atlanteans” మైన్‌క్రాఫ్ట్ పాటలో యానిమేషన్ చేసిన ఇదే శిల్ప నిర్మాణం కనిపిస్తుంది. ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న సముద్ర భవనం ద్వారకా నగరానికి సంబంధించింది కాదని స్పష్టమయ్యింది.

ఫోటో-2:

పోస్టులో షేర్ చేసిన ఈ దృశ్యం యొక్క చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దృశ్యం కలిగిన వీడియో ‘Big Fish Games’ అనే వెబ్సైటులో దొరికింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది ‘Nevertales: Shattered Image’ అనే వీడియో గేములోని చిత్రమని ఈ వెబ్సైటులో తెలిపారు. ఒక యూట్యూబ్ యూసర్ అప్లోడ్ చేసిన ‘Nevertales: Shattered Image’ కలెక్టర్ ఎడిషన్ వీడియోలో కూడా పోస్టులో కనిపించిన అదే శిల్ప నిర్మాణం యొక్క దృశ్యాలు కనిపించాయి. ఈ వివరాల ఆధారంగా, పోస్టులో షేర్ చేసిన ఈ చిత్రం ద్వారకా నగరానికి సంబంధించింది కాదని స్పష్టమయ్యింది.

ఫోటో-3:

నీటి గర్భంలో కనిపిస్తున్న ఈ శిలా చక్రం యొక్క ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే శిలా చక్రం యొక్క ఫోటోని ‘The Daily Mail’ వార్తా సంస్థ 05 డిసెంబర్ 2014 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. 1946లో సముద్ర గర్భంలో మునిగిపోయిన ‘Ghost Ship’ యొక్క స్టీరింగ్ చక్రమని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. అమెరికా హవాయి రాష్ట్రం ఒహు కోస్ట్ సముద్రంలో 2000 అడుగుల లోతులో ఈ చక్రాన్ని కనుగొన్నట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఇదే విషయాన్ని తెలుపుతూ మరికొన్ని వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న శిలా చక్రం ద్వారకా నగరానికి సంబంధించింది కాదని స్పష్టమయ్యింది.

ఫోటోలు 4, 5:

వీడియోలో కనిపిస్తున్న ఈ రెండు సముద్రగర్భ శిలా అవశేషాలు, ఇండోనేసియా బాలి ప్రావిన్సులోని పెముటేరన్ అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌లో ఉన్నట్టు తెలిసింది. ఈ శిలా అవశేషాలు పెముటేరన్ అండర్ వాటర్ గార్డెన్‌లోనివని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. పెముటేరన్ అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్‌ యొక్క దృశ్యాలని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న ఈ రెండు శిలా నిర్మాణాలు కూడా ద్వారకా నగరానికి సంబంధించినవి కావని స్పష్టమయ్యింది.

ఫోటోలు 6,7:

వీడియోలో కనిపిస్తున్న ఈ శీలా కట్టడాలు నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్ అండర్ వాటర్ పార్కు, జమైకా ‘పోర్టు రాయల్’ సముద్ర నగరంలో దాగి ఉన్నట్టు తెలిసింది. ఇదివరకు, ఇవే చిత్రాలని ద్వారకా నగరంలోని దృశ్యాలని షేర్ చేసినప్పుడు, ఈ శిలా కట్టడాలకు సంబంధించిన పూర్తి స్పష్టతనిస్తూ FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఫోటో-8:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Go Travel Trek’ వెబ్సైటు పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్‌లో దొరికింది. 2004 సునామీ ధాటికి తమిళనాడు కరోమండాల్ కోస్టు తరగంబడి పట్టణంలో శిలా అవశేషాలు సముద్ర ఒడ్డున చిందరవందరగా పడి ఉన్న దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఫోటోని ఇదే వివరణతో ‘Flickr’ వెబ్సైటులో పబ్లిష్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ద్వారకా నగరానికి సంబంధించింది కాదని స్పష్టంగా తెలిసింది.

ఫోటో-9:

ఈ ఫోటోలో కనిపిస్తున్నది బహమాస్ దేశం ప్యారడైజ్ ద్వీపంలో నిర్మించిన ‘The Dig Atlantis’ అనే మరైన్ పార్కులోని దృశ్యాలని తెలిసింది. ఇవే దృశ్యాలతో కూడిన ఫోటోలని ‘Atlantis Bahamas’ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేసారు. ఆ ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ద్వారక నగరానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-10:

ఈ ఫోటోలో కనిపిస్తున్న శిల్ప కట్టడం కరీబియన్ దీవులలోని ‘Atlantis Sculpture Park’లో ఉందని  తెలిసింది. ప్రఖ్యాత స్కూబా డైవర్ కేమెన్ బ్రాక్ నిర్మించిన ఈ పార్కులోని ఈ శిలా కట్టడం యొక్క దృశ్యాలని మరికొన్ని వెబ్సైట్లు కూడా షేర్ చేసాయి. ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న ఈ శిలా కట్టడం ద్వారకా నగరానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో 11, 12:

వీడియోలో కనిపిస్తున్న ఈ రెండు శిలా కట్టడాలు సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరంలో వెలికితేసినవే అని తెలిసింది. అరేబియన్ సముద్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ద్వారకా నగరానికి సంబంధించి ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ ఓశనోగ్రాఫి’ వారు పబ్లిష్ చేసిన ఒక డాక్యుమెంట్లో వీడియోలో కనిపిస్తున్న అవే దృశ్యాలు కనిపించాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ ఓశనోగ్రాఫి’ వెబ్సైటులో ద్వారకా నగరంలో లభించిన శిలా కట్టడాల ఫోటోలని షేర్ చేసింది.

చివరగా, వీడియో గేమ్స్, అండర్ వాటర్ పార్కులలోని శిల్పాలని ద్వారక నగరంలో కనుగొన్న శిల్పాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll