Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోలని శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం నిర్మించిన ద్వారక నగరంలోని దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం నిర్మించిన ద్వారక నగరం యొక్క దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం సముద్రం అడుగున నిర్మించిన ద్వారక నగరం యొక్క దృశ్యాలు. 

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఒక్క ఫోటో మినహా మిగితా అన్ని ఫోటోలు ద్వారక నగరానికి సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ పోస్టులో షేర్ చేసిన ఐదు ఫోటోలకు సంబంధించిన వివరాలని ఒక్కోక్కటిగా తెలుసుకుందాం.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ పలు వెబ్సైట్లు ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఇటలీ ‘బయా’ అండర్‌వాటర్ పార్కులోని దృశ్యాలని ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు. ఒక స్కూబా డ్రైవర్ ‘బయా అండర్‌వాటర్ పార్కులో దృశ్యాలని చూపుతూ చేసిన వీడియోని ‘IBT’ న్యూస్ సంస్థ తమ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసింది. ఈ వీడియోలో పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్న అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ‘France 24’ న్యూస్ ఛానల్ ‘బయా’ అండర్‌వాటర్ పార్కుకి సంబంధించి పబ్లిష్ చేసిన వీడియోలో పోస్టులో షేర్ చేసిన అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ద్వారక నగరానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-2:

ఈ ఫోటోలో కనిపిస్తున్న శిల కట్టడాలు ద్వారక నగరానికి సంబంధించి ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ ఓశనోగ్రాఫి’ వారు నిర్వహించిన రిసర్చ్‌లో బయటపడ్డాయని ‘Aaj Tak’ న్యూస్ సంస్థ 2017లో పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అవే శిలాలతో పోలి ఉన్న ఫోటోలని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ ఓశనోగ్రాఫి’ పబ్లిష్ చేసిన ఒక డాక్యుమెంట్లో కనిపించాయి.

ఫోటో-3:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోని ‘Daily Mail’ న్యూస్ సంస్థ తమ ఆర్టికల్‌లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలో సముద్రపు నీటిలో కనిపిస్తున్న శిలా కట్టడం, చైనాలో “అట్లాంటిస్ ఆఫ్ ది ఈస్ట్”గా పిలవబడే ‘శైచెంగ్’ నగరంలోనిదని ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఫోటోని ఇదే వివరణతో ‘BBC’ వార్తా సంస్థ మరియు ‘China Culture.org’ వెబ్సైట్లు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. జినాన్ డ్యామ్ మరియు దాని ప్రక్కనే ఉన్న జలవిద్యుత్ స్టేషన్‌కు మార్గం ఏర్పాటు చేయండం కోసం శైచెంగ్ నగరాన్ని ఉద్దేశాపుర్వంగానే 1959లో జలసమాధి చేసారని ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ద్వారక నగరానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-4:

ఈ ఫోటోలో కనిపిస్తున్నది బహమాస్ దేశం ప్యారడైజ్ ద్వీపంలో నిర్మించిన ‘The Dig Atlantis’  అనే మరైన్ పార్కులోని దృశ్యాలని తెలిసింది. ఇవే దృశ్యాలతో కూడిన ఫోటోలని ‘Atlantis Bahamas’ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేసారు. ఆ ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ద్వారక నగరానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-5:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘Vietnam Times’ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో దొరికింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది కొన్ని వందల సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన  జమైకా ‘పోర్ట్ రాయల్’ సముద్ర నగరంలోని దృశ్యాలని ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఫోటోని ఇదే వివరణతో మరికొన్ని వెబ్సైట్లు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అరేబియన్ సముద్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ద్వారక నగరానికి సంబంధించి పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ ఓశనోగ్రాఫి’ వెబ్సైటులో ద్వారకా నగరంలో లభించిన శిలా కట్టడాల ఫోటోలని షేర్ చేసింది. కాని, ఈ పోస్టులో షేర్ చేసిన ఒక్క ఫోటో మినహా మిగితా నాలుగు ఫోటోలలోని ప్రాచిన కట్టడాలు ద్వారక నగరానికి సంబంధించినవి కావు.

చివరగా, సంబంధం లేని ఫోటోలని శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం నిర్మించిన ద్వారక నగరంలోని దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll