GHMC నిర్లక్ష్యం…. మెహిదిపట్నం లో దారుణం’ అని చెప్తూ, వర్షంలో బైక్ పై వెళ్తున్న వారిపై హోర్డింగు పడే వీడియోని కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వీడియోలో బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి పై హోర్డింగు పడే సంఘటన జీహెచ్ఎంసీ (హైదరాబాద్) లో జరిగింది.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియోకి, జీహెచ్ఎంసీ (హైదరాబాద్) కి అసలు సంబంధం లేదు. ఆ సంఘటన కరాచీ (పాకిస్తాన్) లో జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని పాకిస్తాన్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని పెట్టి కొందరు ఆ ఘటన పాకిస్తాన్ లోని కరాచీ లో జరిగినట్టు పోస్ట్ చేసారని తెలుస్తుంది.
కీ-వర్డ్స్ తో గూగుల్ లో వెతకగా, ఆ ఘటన కరాచీ లో జరిగినట్టు పాకిస్తాన్ లోని ప్రముఖ వార్తాసంస్థలు కూడా ఆర్టికల్స్ ప్రచురించాయని తెలుస్తుంది. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఆ ఘటన లో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయని, ఆ ఘటన తరువాత కరాచీ నగరంలో ఉన్న బిల్ బోర్డులు తీసేయాలని కరాచీ కమీషనర్ ఆర్డర్ చేసినట్టు
ఆ ఆర్టికల్స్ లో చదవొచ్చు.
చివరగా, కరాచీ (పాకిస్తాన్) లో బైక్ పై వెళ్తున్న వ్యక్తి పై హోర్డింగు పడిన ఘటన వీడియో పెట్టి, జీహెచ్ఎంసీ (హైదరబాద్) లో ఆ ఘటన జరిగినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు.