హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై జారిపడుతున్న వాహానదారులంటూ, ఫ్లైఓవర్‌పై వరుసగా బైక్‌లు జారి పడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో విసృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై వరుసగా బైక్‌లు స్కిడై పడుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోతో హైదరాబాద్‌కు ఎటువంటి సంబంధంలేదు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. భారీ వర్షం కురిసిన కారణంగా కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్ ఫ్లైఓవర్‌పై ఇలా ప్రయాణికులు జారిపడ్డారు. అక్కడి వార్తా సంస్థలు ఈ వీడియోను రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
రోడ్డుపై వాహానదారులు జారి పడుతున్న ఈ వీడియోతో హైదరాబాద్‌కు ఎటువంటి సంబంధంలేదు. వీడియోలో చూపిస్తున్న ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది
వైరల్ అవుతున్న వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన పలు పాకిస్తాన్ వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం మొదట భారీ దుమ్ముతో కూడిన గాలులు, ఆ తరవాత భారీ వర్షం కురిసిన కారణంగా కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్ ఫ్లైఓవర్‌పై ఇలా ప్రయాణికులు జారిపడ్డారు.
ఈ వీడియో ఇటీవల పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన ఘటన అంటూ రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
పైగా వైరల్ వీడియోలో ఫ్లైఓవర్ పక్కన కనిపిస్తున్న Vivo మరియు Honda షో రూమ్, గూగుల్ మ్యాప్స్‌లో కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్‌లో కూడా చూడొచ్చు.
ఐతే ఇదే వీడియోను సూరత్ మరియు ముంబైలో జరిగినట్టు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
చివరగా, రోడ్డుపై వాహానదారులు జారి పడుతున్న ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. హైదరాబాద్‌కు ఎటువంటి సంబంధంలేదు.