Fake News, Telugu
 

యెమెన్ దేశస్థుడి మృతదేహాన్ని చూపిస్తూ గుజరాత్ లో ఒక అనాథ మృతదేహాన్ని చుట్టుముట్టిన అతడి పెంపుడు కుక్కలంటూ షేర్ చేస్తున్నారు.

0

గుజరాత్ రాష్ట్రంలో అనాథగా పడివున్న పప్పు శుక్లా మృతదేహాన్ని అతను రోజు తిండి పెట్టి పోషించిన కుక్కలు చుట్టుముట్టి రక్షించాయి, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై అనాధగా పడి ఉన్న మృతదేహాన్ని రెండు కుక్కలు  చుట్టుముట్టిన దృశ్యాన్ని ఈ ఫోటోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: గుజరాత్ లో అనాథగా పడివున్న పప్పు శుక్లా మృతదేహాన్ని అతను తిండి పెట్టి పోషించిన కుక్కలు చుట్టుముట్టి రక్షిస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని కనిపిస్తున్న ఘటన చోటుచేసుకుంది యెమెన్ దేశంలో, భారత దేశంలోని  గుజరాత్ రాష్ట్రంలో కాదు. యెమెన్ దేశానికి చెందిన ఇస్మాయిల్ హది అనే వ్యక్తి మృతదేహం రోడ్డు పై అనాధగా పడి ఉన్నప్పుడు, అతను రోజు తిండి పెట్టి పోషించిన కుక్కలు అతన్ని ఆప్యాయంగా చుట్టుముట్టిన దృశ్యం ఇదని విశ్లేషణలో తెలిసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ఒక అరబిక్ న్యూస్ వెబ్ సైట్ ‘21 అక్టోబర్ 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఫోటోలో కనిపిస్తున్న మృతదేహం యెమెన్ దేశానికి చెందిన ‘ఇస్మాయిల్ హది’ ది అని ఆర్టికల్ లో పేర్కొన్నారు. అనాథగా పడివున్న ఇస్మాయిల్ మృతదేహాన్ని అతను తిండి పెట్టి పోషించిన వీది కుక్కలు చుట్టుముట్టి ఆప్యాయంగా హద్డుకున్న ద్రుశ్యమని ఆర్టికల్ లో తెలిపారు.

ఇదే విషయన్ని తెలుపుతూ మరో అరబిక్ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఇదే విషయం పై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా ఫోటోలో కనిపిస్తున్న మృతదేహం గుజరాత్ రాష్ట్రానికి చెందిన పప్పు శుక్లా కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, యెమెన్ దేశస్థుడైన ఇస్మాయిల్ హది మృతదేహాన్ని చూపిస్తూ గుజరాత్ లో పప్పు శుక్లా అనే వ్యక్తి మృతదేహాన్ని చుట్టుముట్టిన అతడి పెంపుడు కుక్కలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll