ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చర్చిలకి వచ్చిన కానుకల పై యోగి ప్రభుత్వం 6% GST (వస్తు సేవల పన్ను) విదిస్తునట్టుగా పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ ఫోటోని, ఒక యూసర్ తన సోషల్ మీడియా పోస్టులో షేర్ చేసారు. ఇదే క్లెయిమ్ తో మరొక యూసర్ ఈ న్యూస్ ఎడిషన్ యొక్క పూర్తి ఫోటోని ని షేర్ చేసారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చర్చిలకి వచ్చిన కానుకల పై యోగి ప్రభుత్వం 6% GST విధిస్తుంది.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. ఫోటోలో కనిపిస్తున్న న్యూస్ పేపర్ పబ్లిష్ అయ్యింది 11 జనవరి 2010 నాడు. అంటే, భారత ప్రభుత్వం GST చట్టాన్ని తీసుకురాకముందే ఈ ఆర్టికల్ పబ్లిష్ అయినట్టు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్చిలకి వచ్చిన కానుకల పై 6% GST విధిస్తునట్టుగా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన న్యూస్ ఆర్టికల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఈ న్యూస్ పేపర్ ఎడిషన్ యొక్క పూర్తి ఫోటో దొరికింది. కానీ, పోస్టులో చూపించిన హెడ్లైన్, ఈ న్యూస్ పేపర్ ఎడిషన్ లో పబ్లిష్ అవ్వలేదు. ఒరిజినల్ ఎడిషన్ లో ‘Ex-PM Gowda spews abuse at K’taka CM’ అనే హెడ్లైన్ తో ఆర్టికల్ పబ్లిష్ అయ్యి ఉంది. ‘The Times of India’ న్యూస్ ఎడిషన్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్, 2010లో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక ఘటన గురించి రిపోర్ట్ చేసింది. పోస్టులో షేర్ చేసిన ఆర్టికల్ లోని దేవ గౌడ ఫోటో, ఈ న్యూస్ పేపర్ ఎడిషన్ లో కూడా ఉండటాన్ని మనం గమనించవచ్చు.
ఈ న్యూస్ పేపర్ ఎడిషన్ ఫోటోని ‘Kisko’, తమ వెబ్సైటులో పబ్లిష్ చేసింది. ఈ న్యూస్ ఎడిషన్ 11 జనవరి 2010 నాడు పబ్లిష్ అయినట్టు Kisko తమ వెబ్సైటులో తెలిపింది. ఈ న్యూస్ ఎడిషన్ లో కనిపిస్తున్న కొన్ని ఆర్టికల్స్, ‘TheTimes of India’ వెబ్ సైట్ 11 జనవరి 2010 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ జాబితాలో కనిపించాయి.
న్యూస్ ఎడిషన్ పై జహీర్ ఖాన్ ఫోటో ఉండటాన్ని మనం చూడవచ్చు. 10 జనవరి 2010 నాడు జరిగిన భారత్, శ్రీలంక మ్యాచ్ లో జహీర్ ఖాన్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచినందుకు ‘TheTimes of India’ తమ ఎడిషన్ టాప్ లో జహీర్ ఖాన్ ఫోటో వేసినట్టు తెలిసింది. భారత ప్రభుత్వం GST చట్టాన్ని 01 జూలై 2017 నాడు అమలులోకి తెచ్చింది. అంటే, పోస్టులో షేర్ చేసిన ఈ న్యూస్ ఎడిషన్ GST చట్టం అమలుకాక ముందే పబ్లిష్ అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్చిలకి వచ్చిన కానుకల పై 6% GST విధిస్తునట్టుగా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
చివరగా, ఎడిట్ చేయబడిన న్యూస్ పేపర్ ఫోటోని చూపిస్తూ చర్చిలకి వచ్చిన కానుకల పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 6% GST విధిస్తుందంటున్నారు.