Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోలను సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర చిరుత పులి సంచరిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర చిరుత పులి సంచరిస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. చిరుత పులి తనను పట్టుకుందామని ప్రయత్నిస్తున్న కొందరు పోలీసులపై  దాడి చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర చిరుత పులి సంచరిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2022లో హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లాలో చిరుత పులి పోలీసులు, అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన దృశ్యాలను వీడియోలోని మొదటి వీడియో క్లిప్ చూపిస్తుంది. 2022 డిసెంబర్  నెలలో  గురుగ్రామ్ నగరంలోని మానేసర్ వ్యాలీ దగ్గర చిరుతపులి గోడపై నడుస్తూ కనిపించిన దృశ్యాలను రెండవ వీడియో క్లిప్ చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన రెండు వీడియో క్లిప్పులు పాతవి, తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోలో రెండు వేర్వేరు వీడియో క్లిప్పులు కలిగి ఉన్నాయి. ఆ వీడియో క్లిప్పులకి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

వీడియో క్లిప్ 1:

పోస్టులో షేర్ చేసిన వీడియో క్లిప్పు యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన ఫోటోని షేర్ చేస్తూ NDTV వార్తా సంస్థ 2022 మే నెలలో ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లాలో చిరుత పులి పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన దృశ్యాలంటూ ఈ వార్తా సంస్థ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. ఈ వీడియోని అప్పటి పానిపట్ జిల్లా ఎస్పీ శశాంక్ కుమార్ సవాన్ ట్వీట్ కూడా చేశారు.

వీడియో క్లిప్ 2:

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న ఫోటోని ‘దైనిక్ జాగ్రన్’ వార్తా సంస్థ 05 డిసెంబర్ 2022 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్  చేసినట్టు తెలిసింది. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ నగరంలోని మానేసర్ వ్యాలీ దగ్గర చిరుత పులి గోడపై నడుస్తూ కనిపించిన దృశ్యాలంటూ ఈ వార్తా సంస్థ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. గురుగ్రామ్ నగరం మానేసర్ వ్యాలీ దగ్గరలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కంపెనీ గోడపై చిరుత పులి సంచరిస్తుండగా ఈ వీడియోని తీసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ మరి కొన్ని వార్తా సంస్థలు కూడా 2022 డిసెంబర్ నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. ఈ వీడియోని రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో తీసినట్టు 2023 జనవరి నెలలో కొన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ఇంటి సమీపంలో చిరుత పులి కనిపించిందంటూ ఇటీవల ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోలను సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర చిరుత పులి సంచరిస్తున్నదృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll