Fake News, Telugu
 

హిందు జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలలో హిందువులకి మైనారిటీ స్టేటస్ కల్పించమని సుప్రీంకోర్టు ఉత్తర్వు జారి చేయలేదు

0

హిందూ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలలో హిందువులకి మైనారిటీ స్టేటస్ కల్పించమని సుప్రీంకోర్టు బీజేపీ ప్రభుత్వానికి ఉతర్వు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. హిందువుల జనాభా తక్కువగా ఉన్న దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉత్తర్వుని అమలు చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశామిచ్చినట్టు పబ్లిష్ చేసిన ఒక న్యూస్ రిపోర్టుని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిందువుల జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలలో హిందువులకి మైనారిటీ స్టేటస్ కల్పించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చింది.

ఫాక్ట్ (నిజం): హిందువులకి మైనారిటీ స్టేటస్ కల్పించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు, ఆదేశాలు జారీ చేయలేదు. ఈ కేసు పై కేంద్ర ప్రభుత్వ వైఖరి నాలుగు వారాల్లో చెప్పాలని సుప్రీంకోర్టు, ఈ కేసుని నాలుగు వారాలకు వాయిదా వేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, 2020లో బీజేపీ నాయకుడు మరియు లాయర్ అశ్విని ఉపాధ్యాయ, హిందూ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలలో హిందువులకి మైనారిటీ స్టేటస్ కల్పించచాలని సుప్రీంకోర్టు లో పిటిషన్ ఫైల్ చేసినట్టు తెలిసింది.  ఈ కేసుకి సంబంధించిన వివరాలని రిపోర్ట్ చేస్తూ ‘Hindustan Times’ ఇటివల ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. హిందువుల జనాభా తక్కువగా ఉన్న 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో హిందువులని మైనారిటీలగా పరిగణించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినట్టు ఆర్టికల్ లో తెలిపారు.

అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన ఈ కేసు హియరింగ్ 09 ఫిబ్రవరి 2021 నాడు జరిగినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ఈ కేసు పై కేంద్ర ప్రభుత్వ వైఖరి నాలుగు వారాల్లోపు తెలుపమని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఈ కేసుని నాలుగు వారాలకు వాయిదా వేసినట్టు  ఆర్టికల్ తెలిపారు. 09 ఫిబ్రవరి 2021 నాడు సుప్రీంకోర్టు ఈ కేసు కి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుని ఇక్కడ చూడవచ్చు.

సుప్రీంకోర్టు యొక్క అధికారిక వెబ్సైటులో చుస్తే ఈ కేసు పెండింగ్ స్టేటస్ లో ఉంది. దీన్ని బట్టి, హిందువులకు మైనారిటీ స్టేటస్ కల్పించాలని అశ్విని ఉపాధ్యాయ ఫైల్ చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, హిందు జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలలో హిందువులకి మైనారిటీ స్టేటస్ కల్పించమని సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వు జారి చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll