Fake News, Telugu
 

చైనా నిఘా బెలూన్‌ను అమెరికా వైమానిక దళం కూల్చివేసిన దృశ్యాలంటూ ఒక సిములేషన్ వీడియోని షేర్ చేస్తున్నారు

0

అమెరికా గగనతలంలో ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను అమెరికా వైమానిక దళం కూల్చివేసిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: అమెరికా గగనతలంలో ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను అమెరికా వైమానిక దళం కూల్చివేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో సిములేషన్ ద్వారా రూపొందించబడినది. ‘డిజిటల్ కంబాట్ సిములేటర్’ అనే వర్చుయల్ రియాలిటీ గేమింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించి ఈ వీడియోని రూపొందించారు. చైనా నిఘా బెలూన్‌ను అమెరికా వైమానిక దళం కూల్చివేసిన నిజమైన దృశ్యాలని ఈ వీడియో చూపించట్లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Growling Sidewinder’ అనే యూట్యూబ్ ఛానెల్ 05 ఫిబ్రవరి 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అమెరికా F-22 Raptor విమానం ఇటీవల చైనా నిఘా బెలూన్‌ను కూల్చివేసిన దృశ్యాలను ‘డిజిటల్ కంబాట్ సిములేటర్’ వీడియో గేమ్ అప్లికేషన్‌ను ఉపయోగించి రూపొందించినట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు.

డిజిటల్ కంబాట్ సిములేటర్’ అనేది వర్చ్యువల్ రియాలిటీని ఉపయోగించి రూపొందించిన ఒక డిజిటల్ గేమింగ్ అప్లికేషన్. ‘డిజిటల్ కంబాట్ సిములేటర్’ అప్లికేషన్‌ను ఉపయోగించి రూపొందించిన అనేక వీడియోలని ‘Growling Sidewinder’ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. చైనా నిఘా బెలూన్‌ను అమెరికా వైమానిక దళం కూల్చివేయడానికి సంబంధించి ఈ యూట్యూబ్ ఛానెల్ మరొక సిములేషన్ వీడియోని కూడా పోస్ట్ చేసింది.

అమెరికా గగనతలంలో ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను తాము కూల్చివేసినట్టు అమెరికా రక్షణ శాఖ 04 ఫిబ్రవరి 2023 నాడు ప్రకటించింది. చైనా నిఘా బెలూన్‌ను కూల్చివేసిన దృశ్యాలను చూపుతూ పలు ఆమెరికా వార్తా సంస్థలు వీడియోలు పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, పోస్టులో షేర్ చేసిన వీడియో ఈ సంఘటనకు సంబంధించిన నిజమైన దృశ్యాలని చూపించడం లేదు.  

చివరగా, సిములేషన్ వీడియోని షేర్ చేస్తూ చైనా నిఘా బెలూన్‌ను అమెరికా వైమానిక దళం కూల్చివేసిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll