Fake News, Telugu
 

సంబంధంలేని పాత వీడియోను అయోధ్య విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు ‘జటాయువు’ వచ్చినట్టు షేర్ చేస్తున్నారు

0

22 జనవరి 2024న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో రామ మందిర వేడుకకు హాజరయ్యేందుకు ‘జటాయువు’ బృందం అయోధ్యకు చేరుకుందని అని ఒక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా రాబందుల గుంపు ఉన్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు హాజరయ్యేందుకు ‘జటాయువు’ బృందం అయోధ్యకు చేరుకున్న వీడియో.

ఫాక్ట్ (నిజం):  ఈ వీడియో 2021 సంవత్సరం నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందీ తెలియలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో షేర్ చేసిన వీడియోలోని స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘డూజ్’ అనే ఫేస్‌బుక్ పేజీ 8 అక్టోబర్ 2021న పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

అంతే కాకుండా ఇదే వీడియోని గతంలో షేర్ చేసిన మరిన్ని సోషల్ మీడియా పోస్టులు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇదిలా ఉండగా అయోధ్యలో జటాయువు యొక్క భారీ విగ్రహం రామ మందిర ప్రాగణంలో ఏర్పాటు చేస్తున్నట్టు పలు మీడియా కథనాలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ & ఇక్కడ).

చివరగా, సంబంధంలేని పాత వీడియోని అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు హాజరయ్యేందుకు ‘జటాయువు’ బృందం వచ్చింది అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll