Fake News, Telugu
 

సంబంధంలేని పాత వీడియోని ముస్లిం డాక్టర్లు హిందువులకు వైద్యం నిరాకరిస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు

0

ముస్లిం డాక్టర్స్ హిందువులకు వైద్యం చేయం అనీ కరాకండిగ చెపుతున్నారంటూ, హాస్పిటల్‌లో డాక్టర్ ఒక మహిళతో వాగ్వాదానికి దిగిన వీడియోని షేర్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం డాక్టర్ హిందువులకు వైద్యం చేయం అంటూ ఒక మహిళతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2020 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ (LNJP) హాస్పిటల్‌లో డా.లలిత్ ఒక మహిళతో వాగ్వాదానికి దిగాడంటూ ఈ వీడియోని మార్చ్ 2020లో పలు ఆన్లైన్ బ్లాగ్స్ రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియో ఇప్పటిది కాదు, ఇంటర్నెట్‌లో ఈ వీడియో 2020 నుండే అందుబాటులో ఉంది. మార్చ్ 2020లో ఈ వీడియో వైరల్ అయినప్పుడు పలు ఆన్లైన్ బ్లాగ్స్ ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ (LNJP) హాస్పిటల్‌లో డా.లలిత్ ఒక మహిళతో వాగ్వాదానికి దిగాడంటూ ఈ వీడియోను రిపోర్ట్ చేసాయి.

వీడియోలో మహిళతో వాగ్వాదానికి దిగింది ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్‌కు చెందిన డా.లలిత్ అని రిపోర్ట్ చేసిన మరికొన్ని రిపోర్ట్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇటీవల కాలంలో ఈ దృశ్యాలను ముస్లిం డాక్టర్లు హిందువులకు వైద్యం నిరాకరించారన్న వార్తలకు ముడిపెడుతూ రిపోర్ట్ చేసిన కథనాలేవి మాకు లభించలేదు.

ఐతే ఈ సంఘటన ఏ సందర్భంలో జరిగిందో తెలియనప్పటికీ, వీడియోలో ఉన్న డాక్టర్ ముస్లిం కాదు.

చివరగా, సంబంధంలేని పాత వీడియోని ప్రస్తుతం ముస్లిం డాక్టర్లు హిందువులకు వైద్యం నిరాకరిస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll