Fake News, Telugu
 

‘కుష్వంత్ సింగ్ జోక్ బుక్ 9’ పుస్తకంలోని ఒక కల్పిత కథని వాజపేయి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగమంటూ షేర్ చేస్తున్నారు

0

పి.వి.నరసింహారావు భారత ప్రధానిగా ఉన్నప్పుడు అటల్ బిహారి వాజపేయిని భారతీయ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితికి పంపితే, వాజపేయి కాశ్మీర్ వివాదాన్ని ఉద్దేశిస్తూ తన ప్రసంగంలో కశ్యప ముని కాశ్మీర్ విహారయాత్రకు వెళ్ళిన కథని వివరించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. అయితే, వాజపేయి కథని పాకిస్తాన్ ప్రతినిధి మధ్యలోనే అడ్డు చెప్పి, కశ్యపు ముని కాశ్మీర్ విహారయాత్రకు వెళ్ళిన కాలంలో పాకిస్తాన్ ఇంకా ఏర్పడలేదని ఒప్పుకున్నాడని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: కాశ్మీర్ వివాదానికి సంబంధించి భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి ఐక్యరాజ్యసమితిలో ఇచ్చిన ఉపన్యాసం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో తెలిపిన కథని ‘కుష్వంత్ సింగ్ జోక్ బుక్ 9’ పుస్తకంలో ప్రచురించిన ఒక కల్పిత కథని ఎడిట్ చేసి రూపొందించారు. ఈ కల్పిత కథని న్యూ ఢిల్లీకి చెందిన విపిన్ బుక్శే అనే వ్యక్తి అందించారు. ఈ కథకీ, భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, 1994లో  పి.వి.నరసింహారావు భారత ప్రధానిగా ఉన్నప్పుడు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ (UNHCR) 1994 జెనివా సమావేశానికి అటల్ బిహారి వాజపేయిని భారత ప్రతినిధి బృందానికి ప్రాతినిధ్యం వహించమని పంపినట్టు తెలిసింది. కాశ్మీర్ వివాదానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి ఈ సమావేశంలో భారత్‌కు వ్యతిరేకంగా ఆమోదించాలనుకున్న తీర్మానాన్ని భారత ప్రతినిధి బృందం విజయవంతంగా తిప్పికొట్టింది. కానీ, 1994 జెనీవా సమావేశంలో వాజపేయి తన ఉపన్యాసంలో కశ్యప ముని కథని చెప్పినట్టు ఎక్కడా సమాచారం లేదు. 1994 UNHCR జెనీవా సమావేశంలో భారత ప్రతినిధి బృందం ఇచ్చిన ప్రతిస్పందనలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.   

ఈ పోస్టులో తెలిపిన కథకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, ‘కుష్వంత్ సింగ్ జోక్ బుక్ 9’ పుస్తకంలో ప్రచురించిన ఒక కల్పిత కథని ఎడిట్ చేసి ఈ కథని రూపొందించినట్టు తెలిసింది. వివధ ఈ-కామర్స్ వెబ్సైటులలో ‘కుష్వంత్ సింగ్ జోక్ బుక్ 9’ పుస్తకం యొక్క లింకులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ కల్పిత కథని న్యూ ఢిల్లీకి చెందిన విపిన్ బుక్శే అనే వ్యక్తి అందించినట్టు ఈ పుస్తకంలో తెలిపారు. ‘కుష్వంత్ సింగ్ జోక్ బుక్ 9’ పుస్తకంలో ప్రచురించిన ఈ కల్పిత కథ యొక్క స్క్రీన్ షాట్లని కింద చూడవచ్చు.

చివరగా, ‘కుష్వంత్ సింగ్ జోక్ బుక్ 9’ పుస్తకంలోని ఒక కల్పిత కథని ఎడిట్ చేసి వాజపేయి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll